Venu Goapl Reddy
Author- NTV Telugu-
North Korea: నార్త్ కొరియా క్షిపణి ప్రయోగం.. కమలా హారిస్ పర్యటన ముందు కీలక చర్య
North Korea fires ballistic missile: నార్త్ కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. ఆదివారం తన నార్త్ కొరియా తూర్పు తీరంలో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలకు ఉత్తర కొరియాలోని ప్యాంగాంగ్ ప్రావిన్సులోని టైచోన్ ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. మాక్ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. కాగా.. క్షిపణి 50 కిలోమీటర్ల ఎత్తులో… -
BJP: టార్గెట్ 2024.. ఈ నెల 27న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల కీలక సమావేశం
BJP state in-charges meeting: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సిద్ధం అవుతోంది. కేంద్ర మంత్రులు, జాతీయాధ్యక్షుడు, ఇతర కీలక నేతలు తరుచుగా పలు రాష్ట్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2024 లోక్ సభ ఎన్నికలపై చర్చ జరిగింది. గతంలో బీజేపీ పార్టీ తక్కువ మెజారిటీతో ఓడిపోయిన 100కు పైగా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో దిశానిర్ధేశం చేశారు. -
Rajasthan: కాంగ్రెస్ కీలక భేటీ.. సీఎం మార్పుపై అశోక్ గెహ్లాట్ నివాసంలో మీటింగ్
Congress party key meeting in Rajasthan: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉండనున్నారు. దీంతో ఆయన సీఎం పదవిని వదులుకోనున్నారు. అయితే ముందుగా అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవితో పాటు రాజస్థాన్ సీఎంగా కొనసాగాలని అనుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ ‘‘ఒక వ్యక్తికి ఒక పదవి’’ అనేది కాంగ్రెస్ నిర్ణయం అని స్పష్టం చేశారు. దీంతో ఇక గెహ్లాట్ అధ్యక్షుడు అయితే సీఎం పోస్టు… -
Gujarat: అత్యాచారం కేసులో ఆప్ నేత అరెస్ట్
Gujarat AAP leader arrested for raping: ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు జరగబోతున్నాయి. మరోసారి బీజేపీ గుజరాత్ లో గెలుపొందాలని భావిస్తోంది. 2024 ఎన్నికల ముందు సెమిఫైనల్స్ గా ఎన్నికలను భావిస్తోంది. ఇదిలా ఉంటే పంజాబ్ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న ఉత్సాహంతో గుజరాత్ లో కూడా పాగా వేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే ఆప్ నేతలు మాత్రం పలు కేసుల్లో ఇరుక్కుంటుండం ఆ పార్టీకి మింగుడపడటం లేదు. -
Ankita Bhandari Case: అంకితా భండారీ హత్య.. పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు
Ankita Bhandari Case: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంకితా భండారీ హత్య కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ నేత కుమారుడి రిసార్టులో పనిచేస్తున్న అంకితాను హత్య చేశారు. ఈ హత్యలో బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య కీలక నిందితుడిగా ఉన్నారు. దీంతో శుక్రవారం వినోద్ ఆర్యను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ ఉత్తర్వులు జారీ చేసింది. -
West Bengal: టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారు.. మిథున్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు..
Mithun Chakraborty comments on TMC: బీజేపీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన ఆయన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)పై విమర్శలు గుప్పించారు. గత జూలైలో మిథున్ చక్రవర్తి.. టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. తాజాగా మరోసారి ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. తాను జూలైలో చేసి వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిథున్ చక్రవర్తి అన్నారు. టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో… -
5G Rollout In India: 5జీ ప్రారంభానికి డేట్ ఫిక్స్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
భారతదేశంలో మొబైల్ నెట్ వర్క్ లో కొత్త శకం ప్రారంభం కాబోతోంది. 5 జీ ప్రారంభానికి డేట్ పిక్స్ అయింది. అక్టోబర్ 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశంలో 5 జీ సేవలు ప్రారంభించనున్నారు. -
PFI: భారత్‌ను ఇస్లామిక్ దేశంగా చేసే కుట్ర.. ఎన్ఐఏ రిపోర్టులో సంచలన విషయాలు
PFI conspiracy to make India an Islamic country: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ), ఈ సంస్థ నాయకుల ఇళ్లపై రెండు రోజుల క్రితం దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీలు సోదాలు నిర్వహించి 106 మంది కీలక సభ్యులను అదుపులోకి తీసుకుంది. అయితే తాజాగా ఎన్ఐఏ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 మంది రిమాండ్ రిపోర్టులో ఎన్ఐఏ కోర్టుకు పలు విషయాలను తెలియజేసింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని.. ప్రముఖ నాయకులను లక్ష్యంగా చేసుకుని అత్యంత నేరారోపణలు ఉన్నాయని… -
CBI’s Operation Meghchakra: పిల్లల లైంగిక దోపిడి కేసుపై దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు
CBI raids in child pornography case: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టికేషన్(సీబీఐ) దేశవ్యాప్తంగా భారీగా దాడులు చేసింది. పిల్లల లైంగిక దోపిడికి సంబంధించిన కేసులో 19 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 56 ప్రదేశాలపై దాడులు చేశారు. పిల్లలకు సంబంధించిన లైంగిక మెటీరియర్ ను సర్య్కులేట్ చేస్తున్న ముఠాల ఆటకట్టించేందుకు సీబీఐ పెద్ద ఎత్తున రంగంలోకి దిగింది. న్యూజిలాంట్ లోని ఇంటర్‌పోల్ యూనిట్ సింగపూర్ ద్వారా ఇచ్చిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. -
Pakistan: పాకిస్తాన్లో మరో హిందూ బాలిక కిడ్నాప్.. కేసు నమోదుకు పోలీసుల నిరాకరణ
Hindu Girl Kidnapped In Pakistan: పాకిస్తాన్ లో హిందూ బాలికలు, మహిళల కిడ్నాపులు ఆగడం లేదు. బలవంతంగా హిందూ బాలికలను, యువతులను అపహరించి మతం మార్చి బానిసలుగా మార్చుకుంటున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అవకాశం వస్తే కాశ్మీర్లో మైనారిటీ హక్కుల గురించి సిగ్గులేకుండా మాట్లాడుతోంది. తన దేశంలో మైనారిటీలో జరుగుతున్న అకృత్యాల గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!