Venu Goapl Reddy
Author- NTV Telugu-
Russia School Shooting: రష్యా స్కూల్ కాల్పుల్లో 13 మంది మృతి..
Russia School Shooting: రష్యాలో దారుణం జరిగింది. ఓ దుండగుడు స్కూల్ లో విచక్షణారిహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మరణించారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడు తనను తాను చంపుకున్నాడు. సెంట్రల్ రష్యాలోని ఇజెవ్స్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని ఓ పాఠశాలలోకి ప్రవేశించి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మరణించిన 13 మందిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్లు గవర్నర్ అలెగ్జాండర్ బ్రెచలోవ్ వెల్లడించారు. -
Rajasthan Political Crisis: కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల చిచ్చు.. హైకమాండ్ ముందు మూడు షరతులు
Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు. అక్టోబర్ 19 తర్వాత నిర్ణయం తీసుకోవాలని… -
kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
kerala Hijab Protest: ఇప్పటికే కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ వివాదం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. విద్యాసంస్థల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించి రావడాన్ని కర్ణాటక హైకోర్టు వ్యతిరేకించింది. ఇది ఇస్లాంతో తప్పని సరి సంప్రదాయం కాదని తీర్పు చెప్పింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉంది. ఇదిలా ఉంటే కేరళలో కూడా హిజాబ్ వివాదం చెలరేగింది. కేరళలోని కోజికోడ్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించినందుకు పాఠశాలలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతో వివాదం చెలరేగింది. -
PM Narendra Modi: చండీగఢ్ ఎయిర్‌పోర్టు పేరు భగత్ సింగ్‌గా మార్పు.. ప్రకటించిన పీఎం మోదీ
Chandigarh Airport To Be Renamed After Bhagat Singh: చండీగఢ్ విమానాశ్రయానికి పేరు మార్పు గురించి హర్యానా, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వినతుల నేపథ్యంలో విమానాశ్రయం పేరును ‘‘ భగత్ సింగ్’’గా మార్చుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రకటించారు. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడికి నివాళిగా.. చండీగఢ్ విమానాశ్రయం పేరును ఇప్పుడు షహీద్ భగత్ సింగ్ గా మార్చుతున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. -
Jammu Kashmir: స్కూళ్లలో భజనలు, సూర్యనమస్కారాలు నిలిపేయాలి: ముత్తాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా
Islamic body seeks ban on bhajans across schools in jammu kashmir: కాశ్మీర్ పాఠశాలల్లో శనివారం చేస్తున్న భజనలు, సూర్య నమస్కారాలు నిలిపివేయాలని ముత్తాహిదా మజ్లిస్- ఎ- ఉలేమా(ఎంఎంయూ) ప్రభుత్వం, విద్యాశాఖను కోరింది. ముస్లింల మతపరమైన భావాలు దెబ్బతింటున్న కారణంగా వీటన్నింటిని నిలపివేయాలని కోరింది. జామియా మసీద్ మతగురువు, హురియత్ ఛైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నేతృత్వంలోని ఈ సంస్థ యోగా, ఉదయం ప్రార్థనల పేరుతో చట్టాలు తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.ముస్లిం విద్యార్థులు భజనలు, సూర్యనమస్కారాలు చేయాలని పాఠశాల సిబ్బంది… -
Chimpanzees Kidnapped: చింపాంజీల కిడ్నాప్.. ఎందుకో తెలిస్తే మీరు షాక్
Chimpanzees Kidnapped For Ransom: ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు. డబ్బుల కోసం మనుషులను కిడ్నాప్ చేయడం చూశాం.. కానీ కాంగోలో ఓ సాంక్చుయరీ నుంచి ఏకంగా మూడు చంపాజీలను కిడ్నాప్ చేసి డబ్బుల కోసం డిమాండ్ చేశారు కొందరు. సెప్టెంబర్ 9న కటంగా సాంక్చుయరీ నుంచి కిడ్నాప్ చేశారు. ఆ సాంక్చుయరీలో మొత్తం 5 చింపాంజీలు ఉంటే రెండు వంటగదిలో దాక్కోగా..సీజర్, హుస్సేన్, మోంగా అనే మూడింటిని దుండగులు కిడ్నాప్ చేశారు. ఇలా చింపాంజీలను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం ప్రపంచంలో… -
Punjab: గవర్నర్ వర్సెస్ సీఎం.. పంజాబ్ అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి
Punjab Politics- Governor vs CM: పంజాబ్ రాష్ట్రంలో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మధ్య వివాదం చెలరేగుతోంది. బలపరీక్ష నిర్వహించి సభలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం భగవంత్ మాన్ అనుకున్నప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య వివాదం చెలరేగింది. ఇదిలా ఉంటే తాజాగా భగవంత్ మాన్ కోరిన మేరకు మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు పిలుపునిచ్చారు. ‘‘చాలా దయ’’తో గవర్నర్ మా అభ్యర్థనను అంగీకరించారని.. స్పీకర్ కల్తార్ సింగ్ సంధ్వన్ ట్వీట్ చేశారు. అయితే ఈ సెషన్ లో… -
Sonia Gandhi: సోనియా గాంధీతో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ కీలక భేటీ
Nitish Kumar, Lalu Prasad to meet Sonia Gandhi in Delhi today: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు నితీష్ కుమార్, లాలూ ప్రసాద్, కేసీఆర్ వంటి నేతలు. బీహార్ లో జేడీయూ-ఆర్జేడీ మహాకూటమిలాగే కేంద్రంలో మహాకూటమి ఏర్పాటు చేసే దిశలో ఉన్నారు నితీష్ కుమార్. ఇటీవల బీహార్ సీఎంగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్.. సెప్టెంబర్ మొదటివారంలో… -
Tamilnadu: ఆర్ఎస్ఎస్ నేతలపై కొనసాగుతున్న దాడులు.. పీఎఫ్ఐ అరెస్టుల నేపథ్యంలో ఘటనలు
Petrol bomb attack on RSS leader's house in tamilnadu: తమిళనాడు వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నేతలు, బీజేపీ నాయకులు ఇళ్లపై వరసగా దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి మధురైలో మరోదాడి జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎంఎస్ కృష్ణన్ ఇంటిపై మూడు పెట్రోల్ బాంబులు విసిరారు దుండగులు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోలీస్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు. ఘటనకు పాల్పడిన దుండగుడి కోసం పోలీసులు సెర్చ్ టీంలను ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో ఎవరూ… -
Karnataka: గంజాయి స్మగ్లర్ల దాడి.. చావుబతుకుల మధ్య పోలీస్ ఇన్స్పెక్టర్
Ganja smugglers attacked the police: గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై దాడికి తెగబడ్డారు స్మగ్లర్లు. దాడిలో సీఐ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన చావుబతులకు మధ్య ఉన్నారు. సీఐ శ్రీమంత్ ఇల్లాల్ నేతృత్వంలో పోలీసుల టీం దర్యాప్తులో భాగంగా బీదర్ జిల్లాలో సరిహద్దులోని మహారాష్ట్ర గ్రామంలో గంజాయి పంటను సాగు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. బీదర్ జిల్లాలోని కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులోని తురోరి, హోన్నాలి గ్రామాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి 40 మందికి పైగా స్మగ్లర్ల ముఠా పోలీసులపై విచక్షణారహితంగా దాడులు చేశారు.
తాజావార్తలు
-
Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
-
Harish Rao : రేవంత్ రెడ్డివన్నీ డైవర్షన్ రాజకీయాలు, పచ్చి అబద్ధాలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!