Pakistan: పాకిస్తాన్‌లో మరోసారి గుర్తుతెలియని వ్యక్తులు మరోసారి ధమాకా సృష్టించారు. పాక్‌లోని దిర్‌లో భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ సన్నిహితుడు ముఫ్తీ హబీబుల్లా హక్కానీని అతిదగ్గర నుంచి కాల్చి చంపారు. గురువారం, గుర్తుతెలియని వ్యక్తులు ఉగ్రవాదిని కాల్చిచంపినట్లు సమాచారం.
Read Also: Pakistan: పాకిస్తాన్‌కు గుడ్ బై చెప్పిన ‘‘మైక్రోసాఫ్ట్’’.. 25 ఏళ్ల తర్వాత ఆఫీస్ క్లోజ్..
నివేదికల ప్రకారం, భద్రతా పరంగా అస్థిరంగా ఉండే దిర్ జిల్లాలో ముఫ్తీ హబీబుల్లా హక్కానీని టార్గెట్ చేశారు. అయితే, అతడిని ఎవరు, ఎందుకు చంపారనేది ఇప్పటికీ పాక్ అధికారులకు తెలియడం లేదు. ఇతడి మరణం లష్కరే తోయిబాతో పాటు, ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యక్రమాలకు భారీ ఎదురుదెబ్బ. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా అధిపతి హఫీజ్ సయీద్ సన్నిహితుడిని చంపేయడంతో ఇతర ఉగ్రవాదుల్లో కూడా భయం మొదలైంది. ఇప్పటికే ఈ గుర్తుతెలియని వ్యక్తులు పాకిస్తాన్‌లోని కీలక ఉగ్రవాదులు, భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని టార్గెట్ చేస్తున్నారు. పదుల సంఖ్యలో ఉగ్రవాదుల్ని కడతేర్చారు.