Dalai Lama: దలైలామా విషయంలో భారత్, చైనాల మధ్య వివాదం నెలకొంది. దలైలామా తన వారసుడిని తానే నిర్ణయించుకునే హక్కు ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై శుక్రవారం చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై దీని ప్రభావాన్ని నివారించడానికి టిబెట్ సంబంధిత విషయాల్లో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలని భారత్ కోరింది.
Read Also: Pakistan: పాకిస్తాన్‌లో మరో ఉగ్రవాది ఖతం.. గుర్తుతెలియని వ్యక్తుల ధమాకా..
14వ దలైలామా చైనా వ్యతిరేక వేర్పాటువాద స్వభావాన్ని భారతదేశం స్పష్టంగా తెలుసుకోవాలని జిజాంగ్(టిబెట్) సంబంధిత అంశాలపై తమ నిబద్ధతను గౌరవించాలని చైనా మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఈ రోజు అన్నారు. చైనా టిబెట్‌ని జిజాంగ్ అని పిలుస్తుంది. భారత్ తన మాటలు, చర్యలతో జాగ్రత్తగా వ్యవహరించాలని టిబెట్ తన అంతర్గత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలని, ఇది రెండు దేశాల సంబంధాలను దెబ్బతీస్తుందని మావో అన్నారు.
దలైలామా వారసుడిపై ఆయనే సొంత నిర్ణయం తీసుకుంటారని, మరెవరికీ ఈ హక్కు లేదని కిరణ్ రిజిజు అన్నారు. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సంస్థ కొనసాగుతుందని, 2015లో తన కార్యాలయం స్థాపించిన గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే తన భవిష్యత్ పునర్జన్మను గుర్తించే అధికారం కలిగి ఉంటుందని చెప్పారు. అయితే, చైనా మాత్రం తరుపరి దలైలామా చైనా సార్వభౌమాధికారం, చట్టాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పింది.