B-2 Spirit bomber: ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య 12 రోజలు ఘర్షణలో, ఇరాన్‌పై అమెరికా దాడితో ఈ సంఘర్షన కీలక మలుపు తీసుకుంది. ఇరాన్‌లోకి కీలకమైన అణు సౌకర్యాలపై అమెరికా, ప్రపంచంలోనే అతి శక్తివంతమమైన B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలతో దాడి చేసింది. బంకర్ బస్టర్ బాంబుల్ని ఉపయోగించి, భూమి లోతులో అత్యంత సురక్షితంగా ఉన్న ఇరాన్ అణు ఫెసిటీలను ధ్వంసం చేసింది.
Read Also: Assam: యువకుడి జీవితం నాశనం చేసిన వైద్యుడు.. అనుమతి లేకుండా జననాంగాల తొలగింపు..
అయితే, ఇప్పుడు ఈ B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలపై మిస్టరీ నెలకొంది. ఇందులో ఒక B-2 స్పిరిట్ స్టెల్త్ స్థావరానికి తిరిగా రాలేదని, దాని జాడ ఎక్కడ ఉందో తెలియదని నివేదికలు వెలువడుతున్నాయి. జూన్ 21న మిస్సోరిలోని వైట్‌మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుండి అమెరికా రెండు వేర్వేరు B-2 బాంబర్లు సమూహాలు దాడి కోసం ఇరాన్ బయలుదేరాయి. ఇందులో ఒక విమానాల ఫార్మేషన్ ఇరాన్ రక్షణ వ్యవస్థలను తప్పుదాడి పట్టించేందుకు పసిఫిక్ మీదుగా పశ్చిమ్ దిశలో ప్రయాణించగా, ఏడు B-2లతో కూడిన రెండో సమూహం టెహ్రాన్ లోని ఫోర్డో, నటాంజ్ లోని భూగర్భ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు తూర్పు వైపు వెళ్లాయి.
దాడులు చేసిన టీం తన మిషన్ పూర్తి చేసి, 37 గంటల తర్వాత తన స్థావరానికి తిరిగి వచ్చింది. అయితే, పసిఫిక్ మీదుగా వెళ్లిన B-2 బాంబర్ల టీం గురించి తక్కువ సమాచారం ఉంది. ఈ సమూహం నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ అత్యవసరంగా హవాయిలో ల్యాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్టెల్త్ బాంబర్ హోనోలులులోని హికాయ్ ఎయిర్ ఫోర్స్ బెస్‌లో దిగినట్లు కొన్ని వీడియోలు చూపిస్తున్నాయి. అయితే, దాని చుట్టూ అనుమానాలు నెలకొన్నాయి. దాని కండీషన్, ఎందుకు డైవర్ట్ చేసి ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దాని పరిస్థితి, ఎంతకాలం అక్కడ ఉంటుందనే దానిపై సమాచారం లేదు.