Shri Krishna Janmabhoomi Case: షాహీ ఈద్గా తొలగింపు కేసుపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఓవైపు జ్ఞానవాపి మసీదు వివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. వారణాసి కోర్ట్ తో పాటు సుప్రీం కోర్ట్ లోొ కేసు విచారణ నడుస్తోంది. ఇటీవల వారణాసి కోర్ట్ ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే చేశారు. ఇందులో భాగంగా మసీదులోని ‘వాజు ఖానా’లో బావిలో శివలింగం బయటపడినట్లు వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్ట్ బయటపడిన శివలింగానికి రక్షణ ఇవ్వాలని వారణాసి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను మే 20కి వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే మరోవైపు మరోకొత్త వివాదం ప్రారంభం అయింది. ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీ కృష్ణ జన్మభూమి- షాహీ ఈద్గా కేసును విచారించేందుకు మథుర కోర్ట్ నిర్ణయం తీసుకుంది. మథురలోని శ్రీ కృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న షాహీ ఈద్గాను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించేందుకు మథుర కోర్ట్ అంగీకరించింది. కృష్ణుడి భక్తురాలు రంజనా అగ్నిహోత్రి రెండేళ్ల క్రితం ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుబంధంగా మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఇదిలా ఉంటే ఈ వివాదంపై ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. సుప్రీం కోర్ట్ తీర్పు, ప్రార్థనా స్థలాల చట్టం 1991ని మథుర కోర్ట్ ఉల్లంఘించిందని, పార్లమెంట్ చట్టానికి ఇది వ్యతిరేఖం అని అసదుద్దీన్ అన్నారు. జ్ఞానవాపి అయినా, మథుర అయినా ముస్లిం సమాజంపై మరింత ద్వేషం, అభద్రతా, హిందు సోదరుల్లో అపనమ్మకం వంటి వాతావరణాన్ని సృష్టించి, దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లాలనే ఆలోచనలా ఉందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ వీటన్నింటికి స్వస్తి పలకాలని… సమాజాన్ని విభజించే ఇటువంటి చర్యలను సమర్థించబోమని చెప్పాల్సిన సమయం వచ్చిందని అసదుద్దీన్ అన్నారు. గతంలో జ్ఞానవాపి సమయంలో కూడా అసదుద్దీన్ కీలక వ్యాక్యలు చేశారు. గతంలో బాబ్రీ మసీదును కోల్పోయామని… జ్ఞానవాపిని కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!