KTR: మంత్రి కేటీఆర్ యూకే పర్యటన… రెండో రోజు వివరాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోకి పెట్టుబడులు తెచ్చే విధంగా మంత్రి కేటీఆర్ యూకే పర్యటన సాగుతోంది. వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తూ తెలంగాణ పెట్టుబడులకు అనువైన పరిస్థితులను గురించి వివరిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రెండో రోజు పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. థామస్ లాయిడ్ గ్రూప్ ఎండీ నందిత సెహగల్ తుల్లీ మరియు సీనియర్ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ లో కొనసాగుతున్న తమ కంపెనీ కార్యకలాపాల విస్తరణ పై చర్చించారు.
పియర్సన్ కంపెనీ సీనియర్ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి కేటీఆర్, తెలంగాణలో నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పలు కార్యక్రమాల పైన వివరాలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ తో పని చేసేందుకు రియల్ సంస్థ ముందుకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తో భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన పియర్సన్ సంస్థకి ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్ వారిని తెలంగాణకి ఆహ్వానించారు.
Also Read
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హాల్ఫార్డ్, ప్రో వైస్ ఛాన్స్లర్ పోల్లార్డ్ లు మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరోనాటికల్ యూనివర్సిటీ ప్రయత్నాల పట్ల తాము ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ స్థాయి ఏరోనాటికల్ యూనివర్సిటీ తెలంగాణ కేంద్రంగా తీసుకువచ్చే తమ ప్రయత్నంలో కలిసి రావాలని ఈ సందర్భంగా కేటీఆర్ క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీ బృందానికి విజ్ఞప్తి చేశారు.
హెచ్ఎస్బిసి (HSBC) కి చెందిన పాల్ మెక్ పియార్సన్, బ్రాడ్ హిల్ బర్న్ లు మంత్రి కే తారకరామారావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో తమ కంపెనీ కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఇప్పటికే తమకు బలమైన ప్రెజెన్స్ ఉన్నదని తెలిపారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకు సంబంధించి త్వరలోనే స్పష్టమైన కార్యాచరణతో మరోసారి సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!