కారు కొనాలనుకుంటే.. బుక్ చేస్తే రెండు మూడు నెలల్లో డెలవరీ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో డిమాండ్ అధికంగా ఉంటే 6-7 నెలల వరకు పడుతుంది. అయితే మహీంద్రా ఎక్స్ యూవీ 700 బుక్ చేస్తే కారు రావాలంటే రెండేళ్లు ఆగాల్సిందే. ఈ కార్ సెలెక్టెడ్ మోడల్స్ లో వేయిటింగ్ పిరియడ్ రెండేళ్ల వరకు ఉంది.ఒక వేళ మీరు ఈ కార్ ను ఇప్పుడు బుక్ చేస్తే కార్ రావడానికి 2024 వరకు వేచిచూడాల్సిందే. అంతలా ఈ […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెడుతూనే ఉంది. తాజాగా మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మే మొదటి వారంలో బ్రిటన్ లో బయటపడిన ఈ వైరస్ నెమ్మదిగా యూరప్ దేశాలతో పాటు అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా అమెరికాలో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇన్నాళ్లు యూరప్ ప్రాంతానికే పరిమితం అయిన మంకీపాక్స్ వైరస్ కేసులు అమెరికాలో కూడా పెరుగుతున్నాయి. మే 18న అమెరికాలో తొలికేసును గుర్తించారు. ప్రస్తుతం యూఎస్ఏలో ఏడు […]
విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 3 అభిమానుల అంచనాలను అందుకుంది. ఈ రోజు విడుదలైన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సూపర్ ఎంటర్టైనర్ గా ఉందని ట్విట్టర్ రివ్యూను బట్టి చూస్తే తెలుస్తోంది. సినిమాలో కామెడీ మామూలుగా లేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కుటుంబ సమేతం చూడవచ్చని ఫన్.. విత్ ఫ్రస్ట్రేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలో వెంకీ, వరణ్ తేజ్ కామెడీ సూపర్బ్ గా ఉందంటున్నారు అభిమానులు. […]
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు దాటుతోంది. అయినా రష్యా తన దురాక్రమణను ఆపడం లేదు. ముందుగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకుందాం అనుకున్న రష్యాకు ఉక్రెయిన్ బలగాలు ఎదురొడ్డి నిలిచాయి. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాల ఆయుధ, వ్యూహాత్మక సహాయంతో రష్యాను నిలువరించాయి. దీంతో కీవ్ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లిన రష్యా బలగాలు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలో మారణహోమాన్ని సృష్టిస్తోంది. తూర్పు ప్రాంతంలోనో డోన్ బాస్ లో […]
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై ప్రశంసల జల్లు కురిపించారు. పెట్రోల్ రేట్లను పాకిస్తాన్ ప్రభుత్వం పెంచుతోందన విమర్శిస్తూ… భారత్ పెట్రోల్ రేట్లు తగ్గించడంపై ప్రశంసలు కురిపించారు. పాక్ లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ పై రూ. 30 చొప్పున పెంచడంపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో రష్యా నుంచి 30 శాతం చవకైన చమురు కోసం ఒప్పందం చేసుకున్నామని… కొత్తగా ఏర్పడిన […]
జమ్మూ కాశ్మీర్ లో వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు, పోలీసులు ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు. తాజాగా గత రాత్రి మరో రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అవంతి పొరా, శ్రీనగర్ ఎన్ కౌంటర్లలో నలుగురు లష్కర్ ఉగ్రవాదులను మట్టుపెట్టాయి భద్రతా బలగాలు. జమ్మూ కాశ్మీర్ లో టీవీ ఆర్టిస్ అమ్మీన్ భట్ ను ఒక రోజు ముందు ఉగ్రవాదులు హతమర్చారు. ఈ ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులను 24 గంటలు తిరగకముందే భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. శ్రీనగర్ […]
దాదాపుగా 30 ఏళ్ల క్రితం రోడు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయిన మాజీ క్రికెటర్, ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల సుప్రీం కోర్ట్ సిద్ధూకు ఒక ఏడాది శిక్ష విధించింది. అయితే అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి డాక్టర్ల బోర్డు ప్రత్యేక ఆహారాన్ని సిఫారసు చేసింది. కొబ్బరి నీళ్లు, లాక్టోజ్ లేని పాలు, జ్యూస్, ఆల్మండ్ ఇలా ప్రత్యేక ఆహారాన్ని […]
అస్సాంలో సీఎం హిమంత బిశ్వ శర్మ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నాడు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు పవర్స్ ఇచ్చాడు. తాజాగా బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపైకి కాల్పులు జరిపారు. అయితే అతని లక్ బాగుండి కేవలం గాయాలతో బయటపడ్డాడు. గురువారం అస్సాంలోని కోక్రాజార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సోమవారం రాత్రి సరుకులు తీసుకువస్తున్న క్రమంలో దోల్మారా గ్రామంలో 16 ఏళ్ల బాలికపై ముగ్గురు […]
ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై టూర్ లో తమిళ భాషపై ప్రశంసలు కురిపించారు. తమిళనాడులో రూ. 31,000 కోట్లతో పలు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా తమిళ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ విద్యావిధానం భారతీయ భాషలను ప్రోత్సహించేందుకు ప్రాధాన్యత ఇస్తుతందని.. సాంకేతిక, వైద్య కోర్సులను స్థానిక భాషల్లో అభ్యసించేందుకు అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. దీని వల్ల తమిళ యువతకు మేలు జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. తమిళ భాష శాశ్వతమైనదని..తమిళ సంస్కృతి […]
ప్రధాని హైదరాబాద్ పర్యటన తరువాత ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్లారు. దాదాపు రూ. 31,000 కోట్లతో 11 డెవలప్మెంట్ ప్రాజెక్టులకు సీఎం ఎంకే స్టాలిన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుల్లో పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళనాడులో పర్యటిస్తున్న మోదీకి ఘన స్వాగతం పలికారు అక్కడి ప్రజలు. ఇదిలా ఉంటే తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి కొన్ని విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా హిందీ లాగే తమిళాన్ని అధికార భాష చేయాలని.. మద్రాస్ […]