ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం, పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతారణాన్ని కల్పించేందుకు యోగీ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కర్మాగారాల్లో నైట్ షిఫ్ట్ లో మహిళలు ఎవరూ పని చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత ఏ మహిళా కార్మికులను పని చేయించుకోవద్దని ఆదేశించింది. మహిళల సొంత అనుమతితోనే పని చేసేలా ప్రభుత్వ సర్క్యులర్ ని […]
ఇండియాలో కరోనా తీవ్రత కనిపిస్తోంది. ఓ వైపు కొత్తగా బీఏ4, బీఏ5 వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు తాజాగా మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ రోజూవారీ కరోనా కేసులను వెల్లడించింది. కేసుల సంఖ్య 3 వేల కన్నా తక్కువగానే ఉన్నా.. గత నాలుగైదు రోజుల నుంచి నెమ్మదిగా కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన […]
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న వేళ పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్న వేళ రష్య కీలక టెస్ట్ నిర్వహించింది. ‘జిర్కాన్’ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్య ప్రకటించింది. బారెంట్స్ సముద్రంలోని అడ్మినరల్ గోర్ష్ కోవ్ యుద్ధనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో వైట్ సీలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేధించిందని రష్య రక్షణ మంత్రిత్వ శాక తెలిపింది. కొత్త ఆయుధాల పరీక్షల్లో భాగంగా ఈ టెస్ట్ నిర్వహించినట్లు […]
నేపాల్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మనం మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ.. భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండీ.. భారత్ భూభాగాలైన లిపులేక్, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి నేపాల్ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్ లో చర్చించింది. ఈ మూడు ప్రాంతాలపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కీలక ప్రకటన చేశారు. ఈ […]
ఐపీఎల్ 2022 చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. దీంతో ఈ మ్యాచ్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టైటిల్ ను ఎగరేసుకుపోయేది ఏ జట్టో ఈ రోజుతో తేలనుంది. కొత్త ఫ్రాంచైసీగా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ లీగ్ దశలో టాప్ ప్లేస్ లో నిలిచారు. సెమీస్ లో కూడా అదరగొట్టారు. టీమ్ […]
ఎప్పుడు ఏదో ఓ రాజకీయ అంశంపై కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మహారాష్ట్ర బివండీలో శనివారం ఓ సభలో ప్రసంగించారు. నిజానికి భారత దేశం ద్రవిడియన్లు, ఆదివాసీలది అని కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం నాది కాదు, మోదీ- షాలది కాదు, ఠాక్రేలది కాదని.. ద్రవిడియన్లు, ఆదివాసీలది మాత్రమే అని ఆయన అన్నారుు. మొగల్స్ తరువాతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉన్నాయని అసదుద్దీన్ అన్నారు. ఆఫ్రికా, మధ్య ఆసియా, ఇరాన్, తూర్పు ఆసియా […]
థర్డ్ ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ 2022 విజేతగా నిలిచింది సూపర్ నోవాస్. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, పూణే వేదికగా జరిగిన ఫైనల్స్ లో వెలాసిటీ జట్టుపై 4రన్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో సూపర్ నోవాస్ జట్టు కప్పు ఎగరేసుకుపోయింది. ముందుగా వెలాసిటీ జట్టు టాస్ గెలిచి సూపర్ నోవాస్ కు బ్యాటింగ్ అప్పగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కెప్టెన్ […]
కర్ణాటకలో ఓ కుమారుడు తన తల్లి మరణంతో తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. అయితే తను ఏం చేశాడంటే.. ఏకంగా కోట్ల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును కావేరి నదిలో పడేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే కావేరి నదిలో ఎర్రని బీఎండబ్ల్యూ కార్ తేలడాన్ని ఇటీవల నది వద్ద శ్రీరంగపట్నం గ్రామస్తులు గమనించారు. ముందుగా ఏదో ప్రమాదం జరిగిందనుకుని పోలీసులకు సమాచారం అందిచారు. ఎవరైనా కారుతో సహా మునిగిపోయారా..అని ఘటన స్థలంలో రెస్క్యూ సిబ్బందితో గాలించారు. తరువాత కారులో […]
సీఎం కేసీఆర్ గడువు విధించిన లోపు అమరుల స్మారక చిహ్నాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మాణానికి అవసమరమైన స్టెయిల్ లెస్ స్టీల్ ప్యానెల్స్ దుబాయ్ నుంచి త్వరగా దిగుమతి అయ్యేట్లు చూడాలని.. క్లాడిండ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాన తల్లి విగ్రహం వద్ద అతిథులు నివాళులు అర్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పచ్చదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు అమరుల త్యాగాలు […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా మూడు నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. బలమైన రష్యా ముందు కేవలం వారాల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అంతా అనుకున్నప్పటికీ రష్యాకు ఎదురొడ్డి పోరాడుతోంది. అయితే అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఉక్రెయిన్ కు సైనికంగా, వ్యూహాత్మకంగా సాయపడటంతో ఉక్రెయిన్ ఆర్మీ ఎదురునిలిచి పోరాడుతోంది. ఇదిలా ఉంటే జర్మనీ, ఫ్రాన్స్ కూడా ఉక్రెయిన్ కు ఆయుధాల సరఫరా చేయడానికి […]