దేశ రాజధానిని వడగళ్ల వాన కుదిపేసింది. భారీ గాలి, వడగళ్లతో దేశ రాజధానిని అతలాకుతలం చేసింది. భారీ గాలులులతో చెట్లు కూలిపోయాయి. భారీ వర్షానికి నగర జీవనం ఒక్కసారిగా స్తంభించింది. గంటల తరబడి వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. గాలి వాన భీభత్సానికి పలువురు మరణించారు. చాలా చోట్ల చెట్లు కూలిపోవడం వల్ల వాహనాలు దెబ్బతిన్నాయి. 2018 తర్వాత వచ్చిన చాలా ప్రభావంతో వచ్చిన వర్షంగా వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపుగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో […]
ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం సెంట్రల్ ఆఫ్రికా దేశాలకే పరిమితం అయిన మంకీపాక్స్ ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలకు పాకింది. బ్రిటన్ లో మొదటిసారిగా ఈ ఏడాది మే మొదటి వారంలో తొలికేసు నమోదు అయింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధిని కనుక్కున్నారు. ఆ తరువాత నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో మే 18న తొలి కేసు నమోదు […]
ప్రపంచ అగ్రనేత, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇంకో మూడేళ్లే బతుకుతాడా..? ఇంటెలిజెన్స్ అధికారులు, గూడాచారులు రిపోర్ట్ ఆధారంగా మూడేళ్లకు మించి పుతిన్ బతకరని తెలుస్తోంది. తాజాగా పుతిన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ‘ది ఇండిపెండెంట్’ ఒక నివేదికలో తెలియజేసింది. అతను మూడేళ్లు మించి జీవించి ఉండరని మాజీ రష్యా ఇంటెలిజెన్స్ అధికారి చెప్పినట్లు ఇండిపెండెంట్ ఒక కథనంలో తెలిపింది. పుతిన్ తీవ్రమైన కాన్సర్ తో బాధపడుతున్నట్లు దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడిచింది. రష్యన్ ఫెడరల్ […]
మనీలాండరింగ్ , హవాలా కేసులో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) దూకుడు పెంచింది. కోల్ కతాకు చెందిన కంపెనీకి హవాలా లావాదేవీలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. దీనిపై ఆప్ పార్టీ భగ్గుమంది. కేంద్రం కావాలనే విపక్షాలను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కావాలనే మా పార్టీకి చెందిన మంత్రులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం కేంద్ర సంస్థలతో ప్రతిపక్షాలను బెదిరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. […]
మంత్రి గుమ్మనూర్ జయారామ్, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు టీడీపీ నేతలు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత జయరామ్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంజ్ కారు మంత్రి జయరామ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. బాలయ్య, ఎన్టీఆర్ అభిమానులు నిన్ను రోడ్డు మీద తిరగనివ్వరని హెచ్చరించారు. బాలకృష్ణ, చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మంత్రి జయరామ్ కు లేని ఆమె అన్నారు. జగన్ పథకాలు పక్క రాష్ట్రాలకు ఆదర్శం మంత్రి జయరామ్ అంటున్నారు…అక్రమ మద్యం, […]
మహానాడు విజయంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఒంగోలులో మహానాడు విజయం ప్రజావిజయం అని అన్నారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయిందిన నేతలతో అన్నారు. మహానాడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిందని అన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన సీఎం జగన్ రాజకీయాలకే అనర్హుడని విమర్శించారు. ఇకపై విరామం వద్దని మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాడాలని నేతలకు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో నెలకు […]
మంత్రి మల్లారెడ్డిపై దాడి, వ్యక్తిగత దాడి కాదని.. ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేఖత అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ గెలవలేకనే పీకేను అరువు తెచ్చుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ […]
కర్ణాటకలో వివాదాలకు కొదువే లేదు. కర్ణాటకలో జరిగే ఏదో ఒక అంశం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంటుంది. అక్కడి నేతలు కూడా ఎప్పుడూ ఏదో కాాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ జెండా ఏదో ఒక రోజు జాతీయ జెండా అవుతుందనడంలో సందేహమే లేదని ఆయన అన్నార. కాషాయంపై గౌరవం అనేది ఈ రోజుది కాదని వేల ఏళ్ల […]
తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మాటలను, నాయకులు, అధికారుల మాటలను పట్టించుకునే పరిస్థితి లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. బొగ్గు దిగుమతి అంశంలో కేసీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించారని అన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి విచ్చల విడి అవినీతితో తెలంగాణను అప్పు ల పాలు చేశారని.. ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసే పరిస్థితి లేదని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం సంస్థల నుంచి అప్పులు తెచ్చాడని.. కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి […]
రాకేష్ టికాయత్ పై జరిగిన దాడిపై ఫైర్ అయ్యారు ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్. ఆయనపై జరిగిన దాడిని ఖండిస్తున్నాని అన్నారు. నిన్న రెడ్డి ఘర్జణ సభలో జరిగిన గొడవల గురించి కూడా స్పందించారు. రెడ్డి సామాజిక వర్గగొడవ, దాడులు ప్రజాస్వామ్యంలో తప్పు అని అన్నారు కేఏ పాల్. పుచ్చలపల్లి సుందరయ్య గారు చివరన రెడ్డిని తీసేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో మాటల దాడులు కూడా మానేయాలని హితవు పలికారు. మతాలు, కులాలను వాడుకుని రెచ్చగొడుతున్నారని విమర్శించారు. […]