రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న వేళ పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్న వేళ రష్య కీలక టెస్ట్ నిర్వహించింది. ‘జిర్కాన్’ హైపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్య ప్రకటించింది. బారెంట్స్ సముద్రంలోని అడ్మినరల్ గోర్ష్ కోవ్ యుద్ధనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో వైట్ సీలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేధించిందని రష్య రక్షణ మంత్రిత్వ శాక తెలిపింది. కొత్త ఆయుధాల పరీక్షల్లో భాగంగా ఈ టెస్ట్ నిర్వహించినట్లు రష్యా వెల్లడించింది.
గతంలో 2020లో ఈ జిర్కారణ పరీక్షను పరీక్షించింది రష్యా. సమయంలో దీన్ని గొప్ప సంఘటనగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించాడు. గతంలో కూడా ఇదే నౌక నుంచి మునిగిపోయిన జలాతంర్గామి నుంచి దీన్ని పరీక్షించింది రష్యా. ఈ క్షిపణి ధ్వని కన్నా ఐదు నుంచి 10 రేట్ల వేగంతో 1000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అత్యంత ప్రమాదకరమైన కింజాల్ (బాకు) హైపర్ సోనిక్ క్షిపణిని తొలిసారి ప్రయోగించింది. ప్రస్తుతం ఉన్న రష్యా ఆయుధాలను అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు ట్రాక్ చేయడం, అడ్డుకోవడం చాలా కష్టం. వేగంతో పాటు తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టం వాటిని అడ్డుకోలేదు.
అమెరికాతో పాటు నాటో దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధ, సైనిక సహాయం చేస్తున్నాయి. ఇటీవలే యూఎస్ఏ 40 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్ కు అందించింది. అయితే రష్యా మాత్రం ఇప్పటి వరకు సంప్రదాయ ఆయుధాలతోనే యుద్ధం చేస్తున్నట్లు .. తన దగ్గర ఉన్న అత్యంత అధునాతనమైన ఆయుధాలను ఇంకా బయటకు తీయనట్లు రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు రష్యా తన సైనిక పాటవాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నంగానే తాజాగా జిర్కాన్ క్షిపణి ప్రయోగాన్ని చేసినట్లు తెలుస్తోంది.