ప్రస్తుతం డబ్బు చుట్టూ లోకం తిరుగుతోంది. డబ్బుకు ఇచ్చే విలువ..మానవ సంబంధాలకు ఇవ్వడం లేదు. కాసులకు కక్కుర్తితో హత్యలు, మోసాలు, ఆత్మహత్యలు జరుగుతున్న కాలం ఇది. డబ్బులు కనిపిస్తే దాచుకోవడం, దోచుకోవడం తప్పితే ఇవ్వడం అనేది చాలా వరకు కనిపించదు. కానీ అందరూ అలా ఉండరని.. డబ్బులకు నిజాయితీని తాకట్టు పెట్టరని నిరూపించారు ఓ కానిస్టేబుల్. తనకు రోడ్డుపై దొరికిన రూ. 45 లక్షలను అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు.
Read Also: COVID19 : ఇండియాలో కరోనా కల్లోలం.. కొత్తగా నమోదైన కేసులు ఎన్నంటే..?
వివరాల్లోకి వెళితే ఈ ఘటనల చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది. రాయ్ పూర్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిలంబర్ సిన్హా తన నిజాయితీని చాటుకున్నారు. రూ.45 లక్షల బ్యాగ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించి చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. తాను వేసుకున్న యూనిఫాం గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించారు. నయా రాజయ్ పూర్ లోని కయాబంధ పోస్ట్ కు అనుబంధంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలంబర్ సిన్హా.. రోడ్డుపై ఉదయం ఓ బ్యాగ్ ను చూశాడు. అందులో డబ్బులు ఉన్నట్లు తెలుసుకున్న ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ లో ఈ డబ్బును అప్పగించినట్లు ఎస్పీ సుఖానందన్ రాథోడ్ తెలిపారు. బ్యాగ్ ను తనిఖీ చేయగా.. మొత్తం రూ. 2000, రూ. 500 నోట్లలతో రూ. 45 లక్షలు కనిపించాయి. నిలంబర్ సిన్హాకు సీనియర్ అధికారులు రివార్డు ప్రకటించారు. ఈ నగదు ఎవరిదో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ ప్రారంభించారు.