Manohar Lal Khattar – Pak, Bangladesh, India Can Unite: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశంలో దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ లు విలీనం అవుతాయిన వ్యాఖ్యానించారు. గురుగ్రామ్ లో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా శిక్షణా శిబిరంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ మోర్చాలో ఆయన సోమవారం మాట్లాడారు.
తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలను ఏకం చేసినట్లే భారత్‌లో బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల విలీనం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తూర్పు, పశ్చిమాలు ఏకం అయినప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల విలీనం కూడా సాధ్యమవుతుందని ఆయన అన్నారు. చాలా కాలం క్రితం 1991లో ప్రజలు బెర్లిన్ గోడలను బద్దలు కొట్టిన సంగతిని ఆయన గుర్తు చేశారు. ఇదే విధంగా ఆయన దేశ విభజన గురించి వ్యాఖ్యానించారు. 1947 దేశం పాకిస్తాన్, ఇండియాగా విడిపోవడం బాధాకరం అని వర్ణించారు.
Read Also: CM Kcr Delhi Tour: హస్తినలో సీఎం కేసీఆర్.. రాష్ట్రపతి ముర్మును కలిసే అవకాశం..!
పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటుందని ఖట్టర్ అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆర్ఎస్ఎస్ కు భయపడి.. కాంగ్రెస్ పార్టీ మైనారిటీల్లో అభద్రతా భావాన్ని పెంచిందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.