Myanmar executes 4 democracy activists: మయన్మార్ లోని జుంటా ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడింది. నలుగురు రాజకీయ, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను ఉరితీసింది. ఈ ఘటనపై అంతర్జాతీయంగా మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం విమర్శలు ఎదర్కొంటోంది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి 2020 ఫిబ్రవరిలో సైనికపాలన తీసుకువచ్చింది అక్కడి సైన్యం. అప్పటి నుంచి మయన్మార్ లో ప్రజాస్వామ్యం కోసం ఆందోళలు, నిరసనలు జరుగుతున్నాయి. అయితే వీటన్నింటి క్రూరంగా అణచివేస్తోంది అక్కడి సైన్యం. ఎదురుతిరిగిన వాళ్లను అత్యంత క్రూరంగా చంపేస్తోంది.
తాజాగా మాజీ ప్రజాప్రతినిధి ఫియో జెయా థా, క్యావ్ మిన్ యు, హ్లా మైయో ఆంగ్, ఆంగ్ తుర జాలను ఉరితీశారు. ఫియోజ జెయా థా, ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన వ్యక్తి. మయన్మార్ నేత ఆంగ్ సాంగ్ సూకీకి ప్రస్తుతం సైన్యం నిర్భంధంలో ఉన్నారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూల్చి, ఆంగ్ సాంగ్ సూకీని అరెస్ట్ చేశారు. సైన్యం అధికారంలోకి వచ్చిన తరువాత వారికి ఎదురుతిరిగిన చాలా మందికి మరణశిక్షలు విధించింది. అయితే ప్రస్తుతం ఇవన్నీ అమలు కాలేదు. సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత అక్కడ 2000కు పైగా మందిని సైన్యం కాల్చిచంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Also: 5G Spectrum: 5జీ స్పెక్ట్రం వేలానికి వేళాయె. మరికొద్దిసేపట్లోనే ప్రారంభం.
1980 తరువాత మయన్మార్ లో ఉరిశిక్షలు విధించడం ఇదే తొలిసారి. దాదాపుగా 40 ఏళ్ల తరువాత మయన్మార్ లో ఉరిశిక్షలు విధించారు. ఈ ఘటనపై అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘించి, కనీసం అప్పీలు చేసుకునే అధికారం లేకుండా.. ఎలాంటి విచారణ లేకుండా నలుగురిని శిక్షించారని యూఎన్ఓ ప్రత్యేక ప్రతినిధి టామ్ ఆండ్రూస్ అన్నారు. జీవించే హక్కు, స్వేచ్ఛలను ఉల్లంఘించారనని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు.