Woman arrested for hijab crime.. died in iran: ఇరాన్ దేశంలో ఓ మహిళ మరణం ప్రస్తుతం ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ఆడవాళ్ల దుస్తుల విషయంలో, మతాచారాలను పర్యవేక్షించే ‘ మోరాలిటీ పోలీసులు’ ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ జరిగిన తర్వాత ఆ మహిళ మరణించడంతో అక్కడ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ.. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని టెహ్రాన్ లో ఈ సంఘటన జరిగింది. అరెస్ట్ తరువాత మహిళ కోమాలోకి వెళ్లి శుక్రవారం మరణించింది. దీనిపై అంతర్జాతీయంగా పలు హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Andhra Pradesh Crime: బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసేసిన ప్రియురాలు.. ఎందుకంత కసి..?
రాజధాని టెహ్రాన్ లో మహ్సా అమిని తన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు.. ఆ దేశంలో మహిళల డ్రెస్ కోడ్ పర్యవేక్షించే పోలీసులు ఆమెను హిజాబ్ ధరించలేదని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె కొమాలోకి వెళ్లింది.. శుక్రవారం మరణించింది. యువతి మరణానికి న్యాయం చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో ఏం జరిగిందో తెలియదనేది తెలియరావడం లేదు. సోషల్ మీడియాలో ఈ వార్త హైలెట్ కావడంతో ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున ప్రజలు చేరారు. వీరందరిని పోలీసులు చెదరగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు.
మహ్సా అమినీ అనుమానాస్పద మరణంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏకపక్షంగా పోలీసులు యువతిని అరెస్ట్ చేసి ఆమె మరణానికి కారణం అయ్యారని ఆరోపించింది. ఇరాన్ లోని యూఎస్ రాయబారి రాబర్ట్ మాల్లీ కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆమె తలపై గాయాలు ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అమినీ కేసుపై విచారణ ప్రారంభించాలని అంతర్గత మంత్రిని ఆదేశించారు. ఇటీవల కాలంలో ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ అవుతున్నాయని పలు అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.