World could face recession next year – World Bank report: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. చాలా దేశాల ఆర్థిక పరిస్థితి చాలా వరకు క్షీణిస్తోంది. ఇప్పటికే శ్రీలంక దివాళా తీయగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నాయి.. దీంతో వచ్చే ఏడాది ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవచ్చని ప్రపంచ బ్యాంక్ నివేదికి వెల్లడించింది. ద్రవ్యోల్భణాన్ని తగ్గించడానికి, ఉత్పత్తిని పెంచాలని, సరఫరా అడ్డంకులు తొలగించాలని వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఆర్థిక మాంద్యానికి దగ్గర్లో ఉన్నాయని నివేదిక పేర్కొంది. 1970 ఆర్థిక మాంద్యం తరువాత ప్రస్తుతం ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని తెలిపింది.
2021లో కన్నా ఈ ఏడాది కేంద్ర బ్యాంకుల గ్లోబల్ వడ్డీ రేట్లు పెరుగుదల 4 శాతానికి చేరుకోవచ్చని.. ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచడానికి ఆహారం, ఇంధనం వంటి అస్థిర వస్తువులపై వడ్డీరేట్లు 5 శాతం ఉంటాయని బ్యాంకు తెలిపింది. అమెరికా, యూరప్, భారతదేశం వరకు దేశాలు చౌకైన డబ్బు సరఫరాను అరికట్టేందుకు తద్వారా ద్రవ్యోల్భణాన్ని తగ్గిండచానికి రుణ రేట్లను దూకుడుగా పెంచుతున్నాయని వరల్డ్ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఇది పెట్టుబడిని తగ్గిస్తుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. ఉద్యోగాలు, వృద్ధిని దెబ్బతీస్తుందని తెలిపింది. భారత్ తో సహా అనేక దేశాలు దీన్ని ఎదుర్కొంటాయని తెలిపింది.
Read Also: Supreme Court: హిజాబ్ ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా కామన్ డ్రెస్ కోడ్.. సుప్రీంకోర్టు ఏమందంటే..?
ప్రపంచ వృద్ధి బాగా మందిగించింది. మరిన్ని దేశాలు మాంద్యంలోకి పడిపోయే అవకాశం ఉంది..అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలోని ప్రజలు దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ గురువారం నివేదికను విడుదల చేస్తూ.. అన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ పై ప్రభావం చూపింది. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్ డౌన్ల వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. దీనికితోడు విపరీతమైన వాతారణ పరిస్థితులు వ్యవసాయ అంచనాలపై ప్రభావం చూపినట్లు ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆగస్టు మాసంలో మూడో రెపో రేటును 50 బేసిక్ పాయింట్లు పెంచి 5.40 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ తన ద్రవ్యోల్భన అంచనాను 2022-23కి 6.7 వద్ద ఉంచింది. అయితే వాస్తవ జీడీపీ వృద్ధి 7.2 శాతం ఉంటుందని అంచానా వేసింది.