Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సంస్కృతి, జీవన విధానంలో విడదీయరాని భాగమైన పవిత్ర ఇతిహాసం ‘రామాయణం’ ఇప్పుడు వెండితెరపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ దృశ్య కావ్యం.. భరతభూమి నుంచి ప్రపంచ యవనికపైకి తన మహా ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. జూలై 24న గ్లోబల్ వైడ్‌గా విడుదల కానున్న మోస్ట్ అవేటెడ్ ట్రైలర్‌కు ముందు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ‘ప్రథమ్ సంకల్ప్’ పేరిట నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. రామాయణంలోని విలువలతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన సెంటిమెంట్‌ను గౌరవిస్తూ, దేశ హృదయమైన ఢిల్లీని ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారు. ఈ వేడుకలో ‘రామాయణ’ చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా తొలిసారిగా ఒకే వేదికపై సందడి చేయడంతో అభిమానుల కోలాహలం అంబరాన్నంటింది. భారతీయ సినీ పరిశ్రమకు చెందిన పలు తరాల అగ్ర నటీనటులు ఒకేచోట చేరడం ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఈ సినిమాలో నటీనటుల ఎంపిక ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పైనే ఒక సంచలనంగా మారింది. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ కనిపించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి తన హుందాతనం, కరుణతో కూడిన నటనతో ప్రాణం పోయనుంది. పాన్ ఇండియా స్టార్ యష్ ఈ చిత్రంలో మహాబలశాలి రావణుడిగా నటిస్తూ, తన ‘మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్’ ద్వారా సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. సన్నీ డియోల్.. భక్త హనుమాన్ పాత్రలో అలరించనున్నారు. ఒకప్పటి రామానంద్ సాగర్ రామాయణంలో రాముడిగా కోట్లాది మంది మనసులు గెలిచిన అరుణ్ గోవిల్, ఇందులో దశరథ మహారాజుగా నటిస్తుండటం విశేషం. కైకేయిగా శోభన, విశ్వామిత్రుడిగా అజింక్య దేవ్, ఇంద్రుడిగా కునాల్ కపూర్, లక్ష్మణుడిగా రవీ దూబే నటిస్తుండగా.. శూర్పణఖగా గ్లామరస్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ‘దంగల్’ వంటి విలక్షణ చిత్రంతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా చైనా మార్కెట్లో వందల కోట్ల వసూళ్ల రికార్డులు సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ నితేశ్ తివారీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామాయణాన్ని సంపూర్ణ నిజాయితీతో, ప్రామాణికతతో తెరపై ఆవిష్కరించడమే తన బాధ్యతని, ఇందులో కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా వేల ఏళ్లుగా నిలిచిన మానవీయ భావోద్వేగాలను ప్రేక్షకులు అనుభవిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
Also Read
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
తాజావార్తలు
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
-
Harish Rao : ఎల్ నినో పేరుతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోంది
-
Navratri 2026: నవరాత్రుల్లో డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏమిటి? మొబైల్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యానికి ప్రయోజనాలివే
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!