Kerala Black Magic case: కేరళ పతినంతిట్ట జిల్లాలో ఇద్దరు మహిళలను అత్యంత కిరాతకంగా నరబలి ఇచ్చిన సంఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. అత్యంత ఆటవికంగా ఇద్దరు మహిళలను చంపి శరీర భాగాలను వండుకుని తినడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒక మహిళ శరీరాన్ని 56 భాగాలుగా, మరో మహిళ శరీరాన్ని 5 భాగాలుగా ముక్కలు ముక్కలు చేశారు. జుగుప్సాకరంగా వారి శరీరభాగాలను వండుకుని తినడంతో పాటు బ్రెయిన్ సూప్ చేసుకుని తిన్నారు.
Read Also: Maharashtra: 13 మందిని చంపిన పులి పట్టుబడింది.
ఇదిలా ఉంటే మరో క్షుద్రపూజ కేరళలో కలకలకం సృష్టించింది. ఇది కూడా పతినంతిట్ట జిల్లాలోనే చోటు చేసుకుంది. జిల్లాలోని మళయాళపూజ గ్రామంలో చిన్నారులకు క్షుద్ర పూజ అభ్యసానికి సంబంధించిన మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న 41 ఏళ్ల శోభన అలియాస్ వాసంతి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలను ఇలా భయంకరమైన క్షుద్రవిద్యల్లో పాల్గొనేలా చేసినందుకు మహిళను అరెస్ట్ చేశారు. నిందితురాలైన మహిళ భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు నుంచి మహిళను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి.
దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన పతనంతిట్ట జిల్లా ఇద్దరు మహిళల నరబలి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కొచ్చి సిటీ డిప్యూటీ కమిషనర్ ఎస్ శశిధరన్ ఈ సిట్ కు నేతృత్వం వహిస్తున్నారు. ముగ్గురు నిందితులు షఫి అలియాస్ రషీద్, దంపతులు భగవల్ సింగ్-లైలాను మంగళవారం అరెస్ట్ చేయగా.. వీరందరికి 12 రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు. ఇద్దరు మహిళలను ప్రలోభపెట్టి, వారిని చిత్ర హింసలకు గురిచేసి, వ్యక్తిగత భాగాల్లోకి పదునైన ఆయుధాను చొప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ప్రధాన సూత్రధారి షఫీ అని పోలీసులు తెలిపారు.