Sudan: సూడాన్ ఘర్షణల్లో 61 మంది మృతి.. మృతుల్లో కేరళ వాసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudan: ఆఫ్రికా దేశం సూడాన్ లో అంతర్యుద్ధం ముదురుతోంది. సైన్యం, పారామిలిటరీ మధ్య తగాదాలు తారాస్థాయికి చేరాయి. సైన్యంలో పారామిలిటీరిన విలీనం చేసేందుకు సైన్యాధ్యక్షుడు ప్రతిపాదించడంతో, పారామిలిటీరి కమాండర్ దీనికి ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రహింస చెలరేగింది. రాజధాని ఖార్టూమ్ తో పాటు ఇతర ప్రాంతాలకు కూడా ఘర్షణలు పాకాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సూడాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం భారతీయులందరికి సూచనలు జారీ చేసింది. అందరూ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది.
Read Also: Award Function : విషాదంగా అవార్డుల వేడుక.. వడదెబ్బతో 11మంది మృతి
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ఇదిలా ఉంటే ఖార్టూమ్ లో జరిగిన దాడుల్లో కేరళ వాసి మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన ఆల్బర్ట్ అగెస్తీన్ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందజేస్తామని, అతని మృతదేహాన్ని దేశానికి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. బాధితుడి తండ్రితో కూడా మంత్రి మాట్లాడినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అగెస్తీన్ బుల్లెట్ గాయాలతో చనిపోగా అతని భార్య, కుమార్తె క్షేమంగా ఉన్నారని రాయబార కార్యాలయం తెలిపింది. కెనడాలో ఉన్న తన కుమారుడితో మాట్లాడుతున్న సమయంలో అగెస్తీన్ బుల్లెట్ గాయాలయ్యాని కేరళలోని అతని బంధువులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు అతను తన ఇంట్లోనే ఉన్నాడని తెలిపారు. సుడాన్‌లోని దాల్ గ్రూప్ కంపెనీలో అగెస్టీన్ పనిచేస్తున్నాడు. కేరళ పీసీసీ చీఫ్ కే సుధాకరన్ విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. అగస్తీన్ మృతదేహాన్ని త్వరగా భారత్ తీసుకువచ్చేలా చూడాలని కోరారు. ప్రస్తుతం అధికార లెక్కల ప్రకారం సూడాన్ దేశంలో 4000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో దశాబ్ధాల క్రితం దేశంలో స్థిరపడిన వారు 1200 మంది ఉన్నారు. అక్టోబర్ 2021లో జరిగిన తిరుగుబాటులో సైన్యం అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రభుత్వాన్ని మళ్లీ ప్రజాస్వామ్యం వైపు తీసుకుని వెళ్లే క్రమంలో చర్చల్లో భాగంగా సైన్యం, పారామిలిటరీల మధ్య వివాదం రాజుకుంది.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!