Assam: అస్సాం పోలీసులు బంగ్లాదేశ్‌తో సంబంధం ఉన్న అతిపెద్ద ఉగ్ర ముఠాను అరెస్ట్ చేశారు. భారత భద్రతా, నిఘా విభాగం ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అస్సాంలో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ టెర్రర్ మాడ్యూల్‌ను అధికారులు భగ్నం చేశారు. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో నసీమ్ ఉద్దీన్ అలియాస్ నజీముద్దీన్, అలియాస్ తమీమ్(24), జునాబ్ అలీ (38), అఫ్రాహిమ్ హుస్సేన్ (24), మిజానూర్ రెహమాన్ (46), సుల్తాన్ మెహమూద్ (40), మహ్మద్ సిద్ధిక్ అలీ (46), రషీదుల్ ఆలం (28), మహిబుల్ ఖాన్ (25), షారుక్ హుస్సేన్ (22), మహ్మద్ దిల్బర్ రజాక్ (26), జాగీర్ మియా (33) ఉన్నారు.
Read Also: Sadhguru: “కోడి”ని మేపి “ఏనుగు”గా మార్చే సమయం వచ్చింది.. బంగ్లాదేశ్ కామెంట్స్‌పై సద్గురు..
వీరందరికి ఇమామ్ మహమూదర్ కఫిలా (IMK) ఉగ్రవాద ముఠా కార్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇది బంగ్లాదేశ్‌కు చెందిన జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB) కు చెందిన ఒక శాఖ,. భారత్‌తో దీనిని నిషేధించారు. 2018లో ఐఎంకేని జమాత్ మాజీ సభ్యుడు జ్యువెల్ మహమూద్ అలియాస్ ఇమామ్ మహమూద్ హబీబుల్లా స్థాపించాడు. ఇతను ‘‘గజ్వాతుల్ హింద్’’ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడు.
ఆగస్టు 2024లో షేక్ హసీనా బంగ్లా ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలు పెట్రేగిపోతున్నాయి. ముఖ్యంగా, JMB, అన్సరుల్లా బంగ్లా టీం (ABT) వంటి ఉగ్రవాద సంస్థలు భారత్‌లో వాటి కార్యకలాపాలను యాక్టివ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. దీని కోసం బంగ్లాకు చెందిన ఉమర్, ఖలీద్ అనే వారిని అస్సాంలో ఉగ్రవాద కార్యకలాపాలను సమన్వయం చేయడానికి నియమించారు. ఉగ్రవాదులు భద్రత కలిగిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ముఖ్యంగా, అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపురకు చెందిన యువతను ఉగ్రవాదానికి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.