మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న భారీ ఎంటర్టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సంక్రాంతి బరిలో అత్యంత అంచనాలతో విడుదలవుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. అయితే, తాజాగా ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆడియెన్స్‌కు ఊహించని ఒక భారీ సర్ప్రైజ్ ఉండబోతోంది. అది కూడా ఒక స్పెషల్ సాంగ్ అని, ఆ పాట నేరుగా థియేటర్లలోనే చూసి ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది.
Also Read : Kartik Aaryan : హోటల్ రూమ్‌లో అడ్డంగా దొరికిపోయిన కార్తీక్ ఆర్యన్.. స్పందించిన కరీనా !
గతంలో ఈ చిత్రంలో రమణ గోగుల కాంబినేషన్‌లో ఒక పాట ఉంటుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వినిపిస్తున్న ఆ క్రేజీ సర్ప్రైజ్ ఆ పాటే నా లేక మరేదైనా స్పెషల్ క్యామియో సాంగా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. విడుదలైన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతుండగా, ఈ ‘సీక్రెట్ సాంగ్’ వార్త మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే రేపు అంటే జనవరి 11న సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.