Tomato Prices: టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. నిన్నమొన్నటి వరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న టామాటా, ఇప్పుడు భగ్గుమంటోంది. భారతదేశం అంతటా టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. దీని వలన వినియోగదారులతో పాటు రిటైలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
Congress: 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి అమెరికా నిఘా సంస్థ CIA, ఇజ్రాయిల్ గూఢచార ఏజెన్సీ మొసాద్ కుట్ర పన్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ కేట్కర్ ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాజీ జర్నలిస్ట్ కేట్కర్ మాట్లాడుతూ.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు, ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో 206 సీట్లు గెలుచుకుందని అన్నారు. ట్రెండ్స్ ప్రకారం చూస్తే, కాంగ్రెస్ 250 సీట్లు గెలుచుకుని అధికారం […]
Siddaramaiah: కర్ణాటక కాంగ్రెస్‌లో పవర్ షేరింగ్ వివాదం మరింత ముదిరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2023 ఎన్నికల తర్వాత, అధిష్టానం హామీ ఇచ్చినట్లు చెరో రెండున్నరేళ్లు సీఎం పోస్టును పంచుకోవాల్సిందే అని డీకే శివకుమార్ వర్గం చెబుతోంది.
Assam: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ పెళ్లయిన సమాచారాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకుంటే పదేళ్ల వరకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ బిల్లుపై సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ […]
Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్‌ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్‌ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి.
Cyclone Ditwah: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ భారత్ వైపు కదులుతోంది. దిట్వా తుఫాను ముంచుకొస్తుండటంతో తమిళనాడు హై అలర్ట్ అయింది. తుఫాన్ శ్రీలంక తీరప్రాంతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దానిని అనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వాయువ్య దిశగా కదులుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తుఫానుకు యెమెన్ దేశం దిట్వా తుఫానుగా పేరు పెట్టింది. Read Also: Anjali Sharma: ఆఫ్రికన్ జాతీయుడిని వివాహం చేసుకున్న హిమాచల్ పర్వతారోహకురాలు.. మొదటగా ఎక్కడ […]
Imran Khan vs Asim Munir: అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. రావల్పిండి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ హత్య చేయబడినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో పాక్ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. జైలు అధికారులు, రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌లు మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యం ఉన్నాడని ప్రకటన ఇవ్వడం కూడా పరిస్థితిని చక్కబడేలా చేయలేదు.
Tata Sierra 7-Seater: టాటా మోటార్స్(Tata Motors) తన కొత్త సియెర్రా (Sierra) SUVతో సంచలనాలు క్రియేట్ చేసేందుకు సిద్ధమైంది. కొత్త బాక్సీ డిజైన్‌తో అట్రాక్ట్ చేస్తోంది. డీజిల్, పెట్రోల్ వేరియంట్లతో పాటు ఈవీ వేరియంట్లో కూడా సియెర్రా రాబోతోంది. ఇప్పటికే రూ. 11.49 లక్షల (ఎక్స్-షోరూం) ధరతో బేస్ వేరియంట్‌ను అందిస్తోంది. అగ్రేసివ్ ధరతో వస్తుండటంతో ప్రత్యర్థి కార్ మేకర్స్ కూడా హైరానా పడుతున్నాయి. 5-సీటర్‌గా వస్తున్న ఈ సియోర్రాలో అత్యాధుని ఫీచర్లతో పాటు హై […]
DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో పవర్ షేరింగ్ వివాదం మలుపులు తిరుగుతోంది. 2023 ఎన్నికల తర్వాత, ఒప్పందం ప్రకారం, 2.5 ఏళ్ల తర్వాత తనకు సీఎం పోస్ట్ ఇవ్వాలని డీకే శివకుమార్ కోరుతున్నారు. మరోవైపు, ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య 5 ఏళ్ల పాటు కూడా తానే సీఎంగా ఉండాలని భావిస్తున్నారు.
Crime: ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబిలో ఒక వివాహిత మహిళను సొంత బంధువైన వ్యక్తి కాల్చి చంపాడు. తన కోరికలను తిరస్కరించిన కారణంగా గురువారం ఉదయం 24 ఏళ్ల మహిళను చంపాడు. గత కొంత కాలంగా మహిళపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ, ఆమె నిరాకరిస్తూ వస్తోంది. దీంతో కోపం పెంచుకున్న వ్యక్తి ఆమెను చంపేశాడు. బాధితురాలిని పోలీసులు దీపికా తివారీగా గుర్తించారు.