Snake In Mid-Day Meal: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో పాము వచ్చింది. దీన్ని తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిర్వాహకులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహిరించడం వల్ల పిల్లల ప్రాణాలు ప్రమాదంలో జరిగాయి. గతంలో పలు రాష్ట్రాల్లో మధ్యాహ్న భోజనం కలుషితం అయింది. బల్లులు ఇతర ప్రాణులు మధ్యాహ్నం భోజనంలో పడటంతో పలువురు పిల్లలు అస్వస్థతకు గురైన ఘటనలు విన్నాం. ప్రస్తుతం ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
Read Also: Kantara Movie: ఆస్కార్ రేసులో మరో ఇండియన్ సినిమా.. రెండు విభాగాల్లో క్వాలిఫై
తాజాగా బెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలోని మయూరేశ్వర్ బ్లాక్ లోని ఓ ప్రాథమిక పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వడ్డించిన పప్పులో పాము కనిపించింది. పప్పు ఉన్న పాత్రలో పాము కనిపించిందని సిబ్బంది కూడా పేర్కొన్నారు. ఈ ఆహారం తిన్న తర్వాత పిల్లలు అస్వస్థతకు గురైనట్లు పలు గ్రామాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని బ్లాక్ డెవలప్మెంట్ అధికారి దీపాంజన్ జానా వెల్లడించారు. పిల్లలకు వాంతులు కావడంతో రామ్ పూర్ హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన పిల్లల్లో ఒకరు తప్పా అంతా డిశ్చార్జ్ అయ్యారని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. తల్లిదండ్రులు, స్కూల్ ప్రధానోపాధ్యాయుడిని ఘెరావ్ చేశారు.