Chinese Travellers Rushing To Hong Kong For mRNA Covid Vaccines: చైనాను కోవిడ్ మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పుడూ చూడని విధంగా చైనా ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. ప్రభుత్వం ‘జీరో కోవిడ్’ విధానాన్ని ఎత్తేయడం, అత్యంత వేగంగా వ్యాపించే ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణంగా అక్కడ కేసులు, మరణాల సంఖ్య పెరిగింది. రాజధాని బీజింగ్, షాంఘై ఇతర నగరాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా ఖాళీ లేకుండా రోగులతో నిండిపోయాయి.
Over Rs 10 crore in cash seized from TMC MLA Jakir Hossain's properties: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఏకంగా రూ. 10 కోట్ల నగదును ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జాకీర్ హుస్సెన్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. బుధవారం, గురువారాల్లో మొత్తం 28 ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ముర్షిదాబాద్‌లోని రఘునాథ్గంజ్,…
10 Countries Will Soon Let Non-Resident Indians Make UPI Payments: భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్లను సులభతరం చేసింది యూపీఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వీధిలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు పేమెంట్లు అన్నీ క్యాష్ లెస్ గా మారాయి. కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లావాదేవీలు చేయడానికి. ఇటీవల యూపీఐని విస్తృతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా( ఎన్పీసీఐ) కీలక నిర్ణయం…
Cylinder Blast: హర్యానాలో ఘోరం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరనించారు.పానిపట్ జిల్లా బిచ్పరి గ్రామ సమీపంలోని తహసీల్ క్యాంపు ప్రాంతంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయిన తర్వాత పేలుడు సంభవించి ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకుని మరణించారు. చనిపోయిన వారిలో దంపతులతో పాటు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.
Punjab woman accuses Pak embassy staff: పాకిస్తాన్ ఎంబసీ సిబ్బంది ఓ మహిళ ప్రొఫెసర్ తో అసభ్యంగా ప్రవర్తించారు. లైంగిక కోరికల గురించి అడుగుతూ తిక్క ప్రశ్నలు వేశారు. తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు మహిళ ఆరోపించింది. తన వీసా అపాయింట్మెంట్ కోసం పాక్ ఎంబీసీ వెళ్లినప్పడు సీనియర్ సిబ్బంది తప్పుగా వ్యవహరించినట్లు తెలిపింది. ఈ వ్యవహారంపై భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ కూడా రాశారు ఆమె. చర్యలు తీసుకోవాలని కోరారు.
PM Security Breach: ప్రధాని నరేంద్రమోదీ భద్రతలో మరోసారి వైఫల్యం ఎదురైంది. భద్రతా వలయాన్ని ఉల్లంఘించి ఓ వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరదాకా వెళ్లాడు. కర్నాటకలో హుబ్బలిలో మోదీ రోడ్ షో చేస్తున్న సమయంలో ఈ ఘటన గురువారం ఎదురైంది. వెంటనే భద్రతా సిబ్బంది అతడిని అడ్డగించి లాగిపడేశారు.
Sethusamudram Project: సేతుసముద్రం ప్రాజెక్టుపై గురువారం తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. బీజేపీతో పాటు అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతుగా నిలిచాయి. భారతదేశంలోని తూర్పు, పశ్చిమ తీరాలను కలిపేందుకు ఈ సేతు సముద్రం ప్రాజెక్టు కీలకంగా మారుతుంది. ఈ ప్రాజెక్టును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. గతంలో సేతు సముద్రం ప్రాజెక్టును వ్యతిరేకించిన బీజేపీ కూడా దీనికి సపోర్టు చేసింది. అయితే రామసేతు నిర్మాణానికి ఎలాంటి హాని కలుగకుండా ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని బీజేపీ…
YouTube channels Ban: భారత్ కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్ర ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వంకు పైగా యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధించింది. తాజాగా మరో 6 ఛానెళ్లపై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ బ్యాన్ విధించింది. ఈ ఆరు ఛానెళ్లు సమన్వయంతో తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నట్లు కేంద్ర గుర్తించింది. వీరటికి దాదాపుగా 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానెళ్ల పోస్ట్ చేసిన వీడియోలను 51 కోట్ల సార్లు చూశారు.
Army Chief General Manoj Pande: లైన్ ఆఫ్ ఆక్చువల్ కంట్రోల్(ఎల్ఏసీ) వెంబడి చైనా బలగాల్లో స్వల్ప పెరుగుదల ఉన్నట్లు భారీ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే అన్నారు. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద చైనా దళాల సంఖ్య స్వల్పంగా పెరిగిందని.. వారి కదలికను నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించారు. చైనా బలగాల కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపారు. చైనాతో ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. చైనాను ఉద్దేశిస్తూ.. ఉత్తర సరిహద్దు వద్ద ఎల్ఏసీని…
Melbourne Hindu Temple Attacked By Khalistan Supporters: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో ఖలిస్తాన్ మద్దతుదారులు హిందూ ఆలయంపై దాడి చేశారు. భారత వ్యతిరేక నినాదాలను గోడలపై రాశారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న హిందూ సమాాజంలో ఆందోళన కలిగిస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ ఘటన జరిగింది. మిల్ పార్క్ శివారులోని ఉన్న బీఏపీఎస్ స్వామినారాయణ్ మందిర్ గోడలపై గుర్తు తెలియన వ్యక్తులు ‘‘హిందూస్థాన్ ముర్దాబాద్’’ అంటూ గ్రాఫిటీతో భారత వ్యతిరేక నినాదాలు రాశారు.