Tamil Nadu BJP chief Annamalai to get Z-category security: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడికి కేంద్ర భారీ సెక్యూరిటీని కల్పించింది. ఏకంగా జెడ్-కేటగిరి భద్రతను కల్పించనుంది. అన్నామలై రక్షణగా మొత్తం 33 మంది సీఆర్పీఎఫ్ కమాండోలను నియమించనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నామలైకి గతంలో వై-కేటగిరి సెక్యూరిటీ ఉంది. అయితే ఇటీవల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు అన్నామలై.
Karnataka High Court: తండ్రి ఆస్తులను పంచుకుంటారు కానీ.. అప్పులను పంచుకోరు కొడుకులు. తండ్రి చేసిన అప్పులతో తనకు ఏం సంబంధం ఉందని ఉల్టా ప్రశ్నిస్తుంటారు. నమ్మి అప్పు ఇచ్చిన వ్యక్తిని నట్టేట ముంచుతారు. అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఇక అంతే సంగతులు. కొడుకులను అప్పు చెల్లించాలని కోరితే..తనకు ఆ అప్పు గురించి తెలియదని..నన్నడిగి అప్పు చేశాడా..? అంటూ ఎదురు ప్రశ్నించడం పలు సందర్భాల్లో మనం చూసే ఉంటాం. అయితే అలాంటి కొడుకులకు దిమ్మతిరిగిపోయేలా కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
MV Ganga Vilas: ప్రపంచంలోనే అతి పొడవైన నదీ యాత్రను ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి వారణాసి వేదిక కానుంది. ఎంవీ గంగా విలాస్ అనే నౌకను వీడియో లింక్ ద్వారా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ గా గుర్తింపు పొందింది. షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర మంత్రులు ఈ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
Pakistan media regulatory body cracks down on cable operators airing Indian content: దాయాది దేశం పాకిస్తాన్, భారతదేశం పట్ల నిలువెల్లా వ్యతిరేకతను అవలంభిస్తోంది. అక్కడి ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్నా కూడా అవేవీ పట్టించుకోకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా భారత కంటెంట్ ప్రసారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యలేటరీ అథారిటీ నలుగురు కేబుల్ ఆపరేటర్లపై కేసులు పెట్టింది. చట్టవిరుద్ధంగా భారతీయ ఛానెళ్లను ప్రసారం…
More classified documents found from US President Biden's residence, private office: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంట్లో మరన్ని రహస్య పత్రాలను కనుక్కున్నట్లు వైట్ హౌజ్ గురువారం తెలిపింది. ఈ రహస్య పత్రాలు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. వీటిపై విచారణ ప్రారంభం అయింది. వాషింగ్టన్ లోని బైడెన్ ప్రైవేటు ఆఫీస్ నుంచి ఈ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు
Former Union Minister Sharad Yadav Dies At 75: ప్రముఖ సోషలిస్ట్ నేత, మాజీ కేంద్ర మంత్రి, జేడీయూ వ్యవస్థాపక సభ్యుడు శరద్ యాదవ్(75)కన్నుమూశారు. చాలా కాలంగా శరద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం ఢిల్లీలో తన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని గురుగ్రామ్ లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి శరద్ యాదవ్ అపస్మారస్థితిలోకి వెళ్లారు. పల్స్ లేకపోవడంతో సీపీఆర్ చేశారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. రాత్రి…
Centre's Panel Recommends Market Clearance To Covovax As Covid Booster: కరోనా మహమ్మారిపై పోరులో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ సమర్థవంతంగా పనిచేస్తోంది. ఇప్పటికే దేశంలోని ప్రజలందరికీ ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ అందించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య దాదాపుగా తగ్గింది. ఇదిలా ఉంటే ప్రస్తుత చైనాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసులు వేసుకోవాలని కేంద్రం కోరుతోంది.
Gujarat Businessman Loses ₹ 2.69 Crore In Sex Video Call Trap: సెక్స్ టార్షన్ ఉచ్చులో చిక్కుకున్న ఓ గుజరాత్ వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ.. రూ. 2.69 కోట్లు కొల్లగొట్టారు. సెక్స్ వీడియో కాల్ ట్రాప్ లో ఇరుక్కొని వారు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూపోయాడు. చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లో పునరుత్పాదక ఇంధన సంస్థను నడుపుతున్న బాధితుడికి గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ…
Russian opposition leader's comments on Putin's murder: రష్యా ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన నెక్ట్స్ బర్త్ డే జరుపుకోడని..అతని అంతర్గత వ్యక్తులే అధ్యక్షుడిని చంపుతారని అన్నారు. హేగ్( అంతర్జాతీయ కోర్టు)లో పుతిన్ ను చూడటం తన వ్యక్తిగత కలళ అని దేశం నుంచి బహిష్కరించబడిని ప్రతిపక్ష నేత ఇలియా పోనోమరేవ్ అన్నారు. అయితే ఇది నెరవేరుతుందని తాను అనుకోవడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Bomb threats to Spice Jet flight: ఢిల్లీ నుంచి పూణె వెళ్తున్న స్పైస్ జెట్ విమానానంలో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు విమానాన్ని క్షణ్ణంగా సోదా చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. అధికారుల సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనబడలేదు. బాంబు బెదిరింపులతో ప్రయాణికుల బోర్డింగ్ ను ఆపి బాంబు స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారు.