BJP MLA Blames Good Roads For Rise In Accidents: రోడ్డు ప్రమాదాలు పెరగడంపై మధ్యప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్యెల్యే ఫన్నీ విశ్లేషణ ఇచ్చాడు. రోడ్డు ప్రమాదాలకు మించి రోడ్లే కారణం అని అన్నాడు. రోడ్లు బాగుంటే అధికవేగంగా వాహనాలు వెళ్తాయని.. వాహనాలపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉందని అన్నారు.
Dinosaur Nests And 265 Eggs Found In Madhya Pradesh’s Narmada Valley: మానవుడి మనుగడ లేని సమయంలో డైనోసార్లు ఈ భూమిని ఏలాయి. దీనిపై పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. చాలా చోట్ల డైనోసార్లకు సంబంధించి శిలాజాలు లభించాయి. క్రెటేషియస్ యుగం ముగిసే సమయానికి డైనోసార్లు అంతరించిపోయాయి. ఇదిలా ఉంటే ఇటీవల మధ్యప్రధేశ్ నర్మదా లోయలో డైనోసార్ గూళ్లు, శాకాహార టైటానోసార్లకు సంబంధించి 256 గుడ్లను శిలాజ శాస్త్రవేత్తలు గుర్తించారు.
Covid 19 situation in China: చైనాలో కోవిడ్ ప్రళయం సృష్టిస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు చైనా ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారినపడినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం చైనీస్ న్యూ ఇయర్ కోసం దేశవ్యాప్తంగా కోట్లలో ప్రజలు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చైనీస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం.. జనవరి 13 నుంచి 19 మధ్య చైనా ఆస్పత్రుల్లో…
Twitter: ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తూ షాక్ ఇచ్చిన ఆయన ఆ తరువాత వెరిఫైడ్ ఖాతాలకు నెలకు ఇంత సభ్యతం చెల్లించాలని కొత్త రూల్ తీసుకువచ్చారు. ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ తీసుకువచ్చారు.
Los Angeles Shooting: అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా రాజధాని లాస్ ఏంజిల్స్ నగరంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. లాస్ ఏంజిల్స్ లో చైనీస్ న్యూ ఇయర్ పార్టీలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం రాత్రి కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్లో కాల్పులు ఘటన జరిగింది.
Shraddha Walkar Case: దేశాన్ని కుదిపేసిన శ్రద్ధా వాకర్ కేసులో ఢిల్లీ పోలీసుల 3000 పేజీల ఛార్జీషీట్ రెడీ చేశారు. లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న శ్రద్ధా వాకర్ ను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత క్రూరంగా హత్య చేసి శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 100 మంది సాక్ష్యాలతో పాటు ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలతో ఛార్జీషీట్ సిద్ధం చేశారు. దీనిని న్యాయనిపుణులు పరిశీలిస్తున్నారు. పరీశీలన అనంతం కోర్టులో…
Rahul Gandhi Capable Of Being India's PM,Says Sanjay Raut: భారత జోడో యాత్రతో దేశంలో పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ మేరకు శనివారం రాహుల్ గాంధీతో కలిసి శివసేన(ఉద్ధవ్ ఠాక్రే వర్గం)నేత, ఎంపీ సంజయ్ రౌత్ పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై సంజయ్ రౌత్ ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి తప్ప థర్డ్ ఫ్రంట్ కు ఆస్కారమే లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ భారత దేశానికి ప్రధాని కాగలడని సంజయ్ రౌత్ శనివారం…
Covid Nasal Vaccine: కోవిడ్ మహమ్మారిపై పోరులో మరో ముందడుగు పడింది. ముక్కద్వారా వేసుకునే కోవిడ్ నాసల్ వ్యాక్సిన్ ను ప్రారంభించనున్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఇన్ కోవాక్ ని భారతదేశంలో తొలిసారిగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా శనివారం వెల్లడించారు.
Rahul Gandhi spreading divisive agenda, says BJP: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ జమ్మూ కాశ్మీర్ చేరుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పిస్తోంది. రాహల్ గాంధీ విభజన ఎజెండాను వ్యాప్తి చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ ఆరోపించారు.
Unnamed Islands Of Andamans To Be Named After Param Vir Chakra Awardees: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు జనవరి 23న భారతదేశం ‘పరాక్రమ్ దివాస్’ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని పేరులేని 21 దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్టు పెట్టనున్నారు. జనవరి 23న ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉన్న ద్వీపంలో నిర్మించనున్న జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా ప్రధాని…