దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కప్పేసింది. మధ్యాహ్నం దగ్గర పడుతున్నా వెలుతురు లేదు. పూర్తిగా దృశ్యమానత పడిపోయింది. జోరో స్థాయికి కాంతి పడిపోయింది. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో దట్టంగా పొగ మంచు కప్పేసింది. దీంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. మనుషులు కనిపించలేదని పరిస్థితులు దాపురించాయి.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుడిపై పైలట్ దాడి.. ఉద్యోగి సస్పెండ్
ప్రస్తుతం వాతావరణం పరిస్థితి బాగోలేక పోవడంతో ఢిల్లీ ఎయిర్‌పోర్టు అప్రమత్తం అయింది. దాదాపు 100కు పైగా విమానాలు రద్దయ్యాయి. 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రగతి మైదాన్, భైరత్ మార్గ్, ఆనంద్ విహార్‌లో దృశ్యమానత తగ్గిపోయింది. మధ్యాహ్నం అవుతున్న కూడా వాహనదారులు హెడ్‌లైట్లు ఉపయోగించి డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక ఎయిర్‌పోర్టులకు వచ్చే ప్రయాణికులు వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలని విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచించాయి. క్యాన్సిల్ అయిన విమాన ప్రయాణాలు మార్చుకోవచ్చని.. పూర్తి వాపసు కూడా ఇస్తామని చెప్పాయి.
ఇది కూడా చదవండి: Mallika Sherawat: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందుకు హాజరైన మల్లికా షెరావత్.. ఫొటోలు వైరల్
బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లో దట్టమైన, చాలా దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. శనివారం గాలి నాణ్యత చాలా పేలవంగా ఉండే అవకాశం ఉందని.. ఆది, సోమవారాల్లో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్పింది. ముందస్తుగానే వాతావరణ శాఖ శనివారం ‘ఆరెంజ్’ హెచ్చరిక జారీ చేసింది.
#WATCH | Delhi | Dense layer of toxic fog engulfs the national capital. Visuals from Bhairav Marg near Pragati Maidan. CPCB claims that the AQI in the area is at '433', categorised as 'Severe'. pic.twitter.com/1D79ZqKSeG
— ANI (@ANI) December 20, 2025
Passenger Advisory issued at 07:00 hours.
Please click on this link for real-time winter-ready travel updates: https://t.co/Y0B6lhwIj4#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory pic.twitter.com/Njr8t6CLJL
— Delhi Airport (@DelhiAirport) December 20, 2025
Air India continues to remain vigilant and will make every effort to mitigate fog-related disruptions. We understand how important your travel plans are, especially during this holiday season, and we are working round the clock to minimise any inconvenience.
As…
— Air India (@airindia) December 19, 2025