Global terrorist Abdul Makki calls Kashmir 'Pakistan's national issue': పాకిస్తాన్ దేశానికి చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కాశ్మీర్ గురించి వ్యాఖ్యలు చేశాడు. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్ మక్కీ కాశ్మీర్ ని పాకిస్తాన్ జాతీయ సమస్యగా పేర్కొన్నాడు. ఇటీవల చైనా పట్టువీడటంతో ఐక్యరాజ్యసమితి అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. లష్కరేతోయిబా (ఎల్ఇటి) డిప్యూటీ లీడర్ గురువారం లాహోర్లోని కోట్ లఖ్పత్ జైలు నుండి ఒక వీడియోను విడుదల చేశాడు. తనకు అల్…
IT Layoffs: ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచం ఆర్థికమాంద్యం ముంగిట ఉంది. ఏకంగా మూడోవంతు ప్రపంచదేశాలు ఆర్థికమాంద్యబారిన పడుతాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఏకంగా ప్రపంచంలో 30 లక్షల ఉద్యోగాలు ఊడుతుందని అంచానా వేసింది. గతేడాది కంటే 2023 చాలా కఠినంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 2025 వరకు ఇలాగే పరిస్థితి ఉంటుందని అంచానా వేస్తున్నారు. ఈ ఏడాది జూన్ వరకు ప్రపంచం అంతా మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. మూడు పెద్ద ఆర్థిక వ్యవస్థలు అయిన…
Exercise – heart health: ఆరోగ్యం కోసం జిమ్ కు వెళ్తే గుండె పోటుతో మరణించిన సంఘటనలు ఇటీవల కాలంలో చాలానే చూశాం. యువకులు, వయసు పైబడిన వారు అనే తేడా లేకుండా వ్యాయామాలు చేస్తూ గుండెపోటుకు గురవుతున్నారు. ఫిట్ నెస్ కోసం జిమ్ చేస్తూనే కుప్పకూలిపోతున్నారు. కన్నడ స్టార్ పునిత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే జిమ్ చేస్తూ కార్డియాక్ అరెస్ట్ కు గురై మరణించిన సంగతి తెలిసిందే.
Mamata Banerjee's Cartoon Case: త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కార్టూన్ ను ఇతరులకు ఫార్వర్డ్ చేసినందుకు జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై క్రిమినల్ కేసు నమోదు అయిన 11 ఏళ్ల తరువాత కోల్కతాలోని అలీపూర్ కోర్టు శుక్రవారం అతడిపై అభియోగాలను కొట్టేసింది.
Bomb attack in Pakistan, Train derailed: పాకిస్తాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఓ వైపు బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో ‘‘బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’, మరోవైపు ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో పాకిస్తాన్ తాలిబాన్లు ఆ దేశాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా బలూచిస్తాన్ ప్రావిన్సులో బాంబు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది. బాంబు దాడిలో 15 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పాక్ అధికారులు వెల్లడించారు.
Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు.
Krishna Janmabhoomi Case: ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మొగల్ చక్రవర్తి ఔరంగబేబు ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి మసీదును నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ వివాదంపై హిందూసేన తరుపున విష్ణుగుప్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మథుర కోర్టు విచారణ జరుపుతోంది. తాజాగా శుక్రవారం ఈ వివాదంపై అడిషనల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ 3 కోర్టు విచారణ జరిపింది. తరుపరి విచారణను జనవరి 25కు వాయిదా వేసింది.
Gujarati fan made a golden statue of Prime Minister Narendra Modi: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది బీజేపీ. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో విజయం సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. ఇదిలా ఉంటే ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ అభిమాని ఒకరు ఏకంగా 156 గ్రాముల బంగారంతో మోదీ ప్రతిమను తయారు చేశాడు.
India - China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు.
Pfizer tried bullying India: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ భారత్ తో దుమారాన్ని రేపుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ రచ్చకు దారితీసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లను ఎంచుకోవడం కన్నా, విదేశీ తయారీ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చారని ఆరోపించారు. దీంతో ఫైజర్ కంపెనీ భారత ప్రభుత్వం నుంచి చట్టపరమైన రక్షణను…