Twitter: ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తూ షాక్ ఇచ్చిన ఆయన ఆ తరువాత వెరిఫైడ్ ఖాతాలకు నెలకు ఇంత సభ్యతం చెల్లించాలని కొత్త రూల్ తీసుకువచ్చారు. ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కీలక ముందుడుగు వేసేందుకు సిద్ధం అవుతున్నారు మస్క్. ట్విట్టర్ ను జీరో యాడ్స్ గా మార్చేందుకు అధిక ధరతో సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేయనున్నారు. అన్ని రకాల ప్రకటనలను తొలగించడానికి ట్విట్టర్ బ్లూసబ్‌స్క్రిప్షన్ ను అధిక ధరతో అందిచాలని యోచిస్తున్నట్లు సీఈఓ ఎలాన్ మస్క్ శనివారం ప్రకటించారు.
Read Also: Los Angeles Shooting: లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. పలువురు మృతి
ట్విట్టర్ లో ప్రకటనలు చాలా తరుచుగా కనబడుతాయి, చాలా పెద్దవిగా ఉంటాయ.. రాబోయే వారాల్లో ఈ రెండింటిని పరిష్కరించేందుకు ట్విట్టర్ చర్యలు తీసుకుంటుంది అని ఆయన అన్నారు. అంతకుముందు డిసెంబర్ 2022లో ట్విట్టర్ ప్రైమరీ బ్లూటిక్ తక్కువ ప్రకటనలు చూపుతుందని మస్క్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే ట్విట్టర్ లో పెను మార్పులు తీసుకువచ్చే దిశగా మస్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఖర్చలును తగ్గించుకునేందుకు ఏకంగా 50 శాతం మంది అంటే 3800 మందిని ఉద్యోగాల నుంచి తీసేశాడు. ఇదే కాకుండా మరికొంత తీసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వర్క్ ఫోర్సును కేవలం 2000 వరకే ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Ads are too frequent on Twitter and too big. Taking steps to address both in coming weeks.
— Elon Musk (@elonmusk) January 21, 2023