Australia: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలే టార్గెట్ గా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాద మద్దతుదారులు ఆలయాలపై దాడులు చేస్తూ భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుగా స్లోగన్స్ రాస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలోని ఆల్బర్ట్ పార్క్ లోని ఇస్కాన్ దేవాలయం గోడపై సోమవారం ఉదయం ‘‘ఖలిస్తాన్ జిందాబాద్’’ అనే నినాదాలు కనిపించాయి. ఇది ఈ నెలలో మూడో దాడి.
Read Also: Atrocities Girls: అన్నమయ్య జిల్లాలో అమానుషం.. 14 ఏళ్లకే పసిబిడ్డను జన్మనిచ్చిన మైనర్ బాలిక
ఇటీవల విక్టోరియాలో శ్రీ శివవిష్ణు ఆలయాన్ని ఇలాంటి నినాదాలతో ధ్వంసం చేశారు. ఇది జరిగిన రోజుల వ్యవధిలో మెల్బోర్న్ లో ఇస్కాన్ ఆలయం గోడపై ఇలాంటి నినాదాలే కనిపించాయి. వరస ఘటనలపై హిందూ సమాజంలో ఆందోళన నెలకొంది. అంతకుముందు మెల్బోర్న్ లోని స్వామినారాయణ్ దేవాలయం గోడపై భారత వ్యతిరేఖ, ఖలిస్తానీ మద్దతు నినాదాలు రాశారు. ఈ ఘటనలపై హిందువులు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
దేవాలయాలపై దాడిపై భారత ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వేదికలుగా పలువురు ఖలిస్తానీ మద్దతుదారులు భారత వ్యతిరేక బీజాలు నాటుతున్నారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. యూకే, అమెరికా, కెనడాల్లో గతంలో హిందూ దేవాలయాలపై దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.