Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేవంత్ రెడ్డి ఇటీవల ప్రగతి భవన్ ను నక్సల్స్ పేల్చేయాలని కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని.. ప్రగతి భవన్ కేసీఆర్ సొత్తు కాదని.. అది ప్రజల ఆస్తి అని అన్నారు. ప్రగతి భవన్ ను ప్రజాదర్భార్ కోసం వినియోగించుకోవాలనో, ఆస్పత్రిగా వాడుకోవాలనో రేవంత్ రెడ్డి అంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
స్టార్ క్యాంపెనర్ గా త్వరలో యాత్ర ప్రారంభిస్తా అని.. పాదయాత్రనా..? బస్సుయాత్రనా..? బైకు యాత్రనా..? అనేది త్వరలో డిసైడ్ చేస్తా అని అన్నారు. పాదయాత్ర చేస్తే సమస్యలు తెలుసుకునే అవకాశం తక్కువగా ఉంటుందని.. పాదయాత్రలో అనుచరుల హడావిడి తప్పా, ప్రజా సమస్యల ప్రస్తావన తక్కువగా ఉంటుందని అన్నారు.. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి తప్పా ఇంకోటి కాదని, వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమపైనే ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉందని అన్నారు.
Read Also: Jagga Reddy: సీఎం కేసీఆర్‌తో జగ్గారెడ్డి భేటీ.. తప్పేముందంటూ ప్రశ్న..
బీజేపీ, బీఆర్ఎస్ తోడు దొంగలు: అంజన్ కుమార్ యాదవ్.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గజదొంగ అని, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి అక్రమంగా తన పార్టీలో చేర్చుకున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగలని విమర్శించారు. పదవులు, ఇతర ప్రలోభాల ఆశ చూపించి తీసుకున్నావ్ ఇంతకన్నా దౌర్భగ్యం ఏమైనా ఉంటుందా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యే ల కొనుగోలు అంశాలు సీబీఐ పరిధిలో విచారణ జరుపుతున్న సందర్భంగా మా పార్టీ ఎమ్మెల్యేల విషయం కూడా విచారన చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై గతంలోనే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని ఆయన అన్నారు. ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశారని..12 మంది చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడని విమర్శించారు.