Yogi Adityanath: “వాళ్లను మట్టిలో కలిసేస్తాం”.. సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్యనాథ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉగ్రరూపం దాల్చారు. అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ) ఎమ్మెల్యే హత్య కేసులో సాక్షిగా ఉన్న వ్యక్తిని కొంతమంది దుండగులు హత్య చేశారు. దీనిపై యూపీ అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపిస్తూ హెచ్చరించారు.
2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్యకు గురయ్యారు. ఈ వ్యవహారంపై ఇరు నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమాజ్ వాదీ పార్టీ మాఫియాను ప్రోత్సహిస్తోందని సీఎం ఆరోపించారు. వాళ్లందరిని ‘‘ మట్టిలో కలిపేస్తాం’’ అని హెచ్చరించారు. ఉమేష్ పాల్ శుక్రవారం ప్రయాగ్ రాజ్ లోని తన నివాసంలో బాంబుదాడిలో చంపబడ్డాడు. ఈ దాడిలో అతని గన్ మెన్ కూడా గాయపడ్డాడు, ఆ తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మాజీ ఎంపీ సమాజ్ వాదీ పార్టీ నేత అతిక్ అహ్మద్, అతని తమ్ముడు ఖలీద్ అజీమ్ ను ఓడించి రాజుపాల్ అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచారు. ఆయన గెలిచిన కొన్ని నెలల తర్వాత హత్యకు గురయ్యారు. రాజుపాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్, అతని సోదరుడు, మాజీ ఎమ్మెల్యే అష్రఫ్ ప్రధాన నిందితులుగా ఉన్నారు. నిందితులంతా ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
Read Also: Sonia Gandhi: భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసింది..
ఈ క్రమంలో అసెంబ్లీలో సమాజ్ వాదీ పార్టీపై సీఎం యోగి ఆదిత్య నాథ్ తీవ్ర స్వరంతో మండిపడ్డారు. ఎస్పీ నేరస్తులను ఆదరిస్తోందని, వారికి పూలమాలలతో స్వాగతం పలుకుతున్నారని, ఆపై రాష్ట్రంలో శాంతిభద్రతలపై డ్రామాలు ఆడుతున్నారని సీఎం విమర్శించారు. మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ కు మద్దతు ఎస్పీ మద్దతు ఇచ్చింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని మాఫియాలను ప్రభుత్వం అంతం చేస్తుందని అన్నారు.
సీఎం యోగి వివర్శలపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. నిన్న బాంబులు పేల్చిన తీరు చూస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గ్యాంగ్ వార్ లాంటి పరిస్థితులు ఏర్పడినట్లు స్పష్టం అవుతుందని అన్నారు. బాహటంగా తుపాకులు పేల్చేది రామరాజ్యమా..? అని ప్రశ్నించారు. పోలీసులు పూర్తిగా విఫలం అయ్యారని, బీజేపీ ఈ ఘటనకు బాధ్యత వహించాలని అన్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!