Amritpal Singh: ఖలిస్తానీ సానుభూతిపరులు పంజాబ్ పోలీస్ స్టేషన్ పై దాడి చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అమృత్ పాల్ సింగ్ నాయకత్వంలో ఆయన మద్దతుదారుడు టూపాన్ సింగ్ అరెస్ట్ ను నిరసిస్తూ అంజాలాలోని పోలీస్ కాంప్లెక్స్ పై దాడులు చేశారు. అమృత్ పాల్ సింగ్ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా టూఫాన్ సింగ్ ను విడుదల చేయడానికి పోలీసులు అంగీకరించారు. ఇదిలా ఉంటే ఆయన ఖలిస్తాన్ ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్తాన్ సెంటిమెంట్ అలాగే ఉంటుందని, దాన్ని ఎవరూ అణచివేయలేరని అన్నారు.
Read Also: Marriage In Hospita: మండపానికి రాలేనిస్థితిలో పెళ్లి కూతురు.. ఆసుపత్రికే వెళ్లి తాళికట్టిన వరుడు
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ చీఫ్ అయిన అమృత్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఖలిస్తాన్ నిషిద్ధం కాదని ప్రజల బాధలు అంతం చేయడానికి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ నెల ప్రారంభంలో వరిందర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు అమృత్ పాల్ సింగ్ మద్దతుదారులపై కిడ్నాపింగ్ కేసులు నమోదు అయ్యాయి. వరిందర్ సింగ్, అమృత్ పాల్ సింగ్ మాజీ మద్దతుదారుడు. కిడ్నాప్ చేసిన వ్యక్తులు తనను జల్లూపూర్ ఖేరా గ్రామానికి తీసుకెళ్లారని ఆరోపించారు. అయితే అతనi తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అమృత్ పాల్ సింగ్ ఆరోపించారు.
నేను నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని, నా గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు ప్రచారం చేస్తున్నారని.. కొందరు నా వెనక బీజేపీ మద్దతు ఉందని, పాకిస్తాన్ మద్దతు ఉందని చెబుతుంటారు, నా వెనక గురు సాహిబ్ మద్దతు మాత్రమే ఉందని, నేను రాజకీయ వ్యవస్థలో భాగం కాదని అన్నారు. జాతీయవాదం సరైనది కాదని.. ప్రజాస్వామ్యానికి వేర్వేరు అభిప్రాయాలు ఉండాలని అన్నారు. ఖలిస్తాన్ సెంటిమెంట్ అలాగే ఉందని, దీన్ని ఎవరూ అణచివేయలేరని పేర్కొన్నాడు. మా లక్ష్యమైన ఖలిస్తాన్ ను నిషిద్ధంగా చూడకూడదని.. దాని భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు ఏమిటో మేధో కోణం నుండి చూడాలని..ఇది ఒక భావజాలం, భావజాలం ఎప్పటికీ చావదని అమృత్ పాల్ సింగ్ అన్నారు.