Zombie Virus: ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర ప్రదేశాల్లో చాలా ఏళ్లుగా పలు వైరస్ లు నిద్రాణస్థితిలో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న జాంబీ వైరస్ పై చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. మనిషి ఒక మృగంలా పనిచేసేలా ఈ వైరస్ మారుస్తుంది. అంతటి…
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పుడిలకు అడ్డుకట్ట వేస్తోంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం వీటిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బైబిల్ బోధించినందుకు, విద్యార్థులను చర్చిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ పై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది.
Campa Cola: పాత రుచి కొత్త బాటిల్ తో రానుంది ఐకానిక్ డ్రింక్ క్యాంపాకోలా ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వనుంది. ఈ వేసవిలో ఇండియన్ మార్కెట్ లోకి రాబోతోంది. దాదాపుగా 50 ఏళ్ల క్రితం వరకు ఇండియాలో ఈ బ్రాండ్ చాలా ఫేమస్. 1970,80ల్లో ఇండియాలో చాలా ఫేమస్ అయిన ఈ బ్రాండ్ ను వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భారతదేశంలోకి తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం క్యాంపాకోలా లెమన్, ఆరెంజ్ రుచులతో రాబోతోంది. అదానీ గ్రూప్, యూనిలివర్, ఐటీసీ నుంచి పోటీని ఎదుర్కొని క్యాంపాకోలాను…
India Fuel Demand: భారతదేశ ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. డిమాండ్ కు తగినట్లుగా ఫిబ్రవరిలో రోజుకు 5 శాతం కంటే ఎక్కువగా ఇంధన వినియోగం పెరిగి రోజుకు 4.82 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇది వరసగా 15వ సంవత్సరం పెరుగుదలను సూచిస్తోంది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) డేటా.. భారత ఇంధన డిమాండ్ 24 ఏళ్ల గరిష్టమని పేర్కొంది.
Influenza A(H3N2) Cases: దేశవ్యాప్తంగా సీజనల్ ఇన్ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ వేగంగా విస్తరిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలతో ఈ వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీర్ఘకాలిక దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ కారణంగా దేశంలో 2 మరణాలు సంభవించాయి. ‘‘హాంకాంగ్ ఫ్లూ’’గా పిలిచే హెచ్3ఎన్2 వైరస్ వల్ల దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.
People Fall Sick With Mysterious Illness On A US Cruise Ship: అమెరికాకు చెందిన ఓ క్రూయిజ్ షిప్ లో ఏకంగా 300 మంది అంతుచిక్కని అనారోగ్యంతో బాధపడుతున్నారు. మిస్టరీ వ్యాధి బారిన పడినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీఎస్) నివేదించింది. ప్రిన్సెస్ క్రూయిసెస్ రూబీ ప్రిన్సెస్ షిప్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 5 వరకు టెక్సాస్ నుంచి మెక్సికోకు ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ షిప్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
PM Modi To Visit Karnataka On March 12: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో మరోసారి ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఈ నెల 12న కర్ణాటకకు వెళ్లనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభంతో పాటు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాదాపుగా రూ. 16,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. ప్రతిష్టాత్మక 10 వరసల మైసూర్-బెంగళూర్ ఎక్స్ ప్రెస్ వేను ప్రధాని మాండ్యాలో ప్రారంభించనున్నారు. ఆ తరువాత హుబ్బళ్లి-ధార్వాడలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేయనున్నారు.
Mandya MP Sumalatha extends 'full support' to BJP: ప్రముఖ సినీనటి, ఎంపీ సుమలత అంబరీష్ బీజేపీ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఆమె మాండ్యా లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోదీ కర్ణాకటక పర్యటనకు వెళ్లనున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఆప్ నాయకులు బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేంద్రాన్ని రాక్షస రాజు హిరణ్యకశిపుడితో పోల్చారు. పరోక్షంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుపించారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. కొంతమంది తమను తాము హిరణ్య కశ్యపుడిలా భావించుకుంటూ తమను తాము దేవుడిలా అనుకుంటున్నారని విమర్శించారు.
PM Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోదీతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తో భేటీ అయ్యారు. అయితే ఇటీవల ఆస్ట్రేలియాలో వరసగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. ఇప్పటికే ఈ ఆంశంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ప్రధానితో నరేంద్రమోదీ ఈ అంశాన్ని తేలవనెత్తారు.