Karnataka: మహిళా దినోత్సవం రోజు ఓ మహిళకు అవమానం ఎదురైంది. బొట్టు పెట్టుకోలేదని ఓ మహిళను బహిరంగంగా తిట్టారు బీజేేపీ ఎంపీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. బీజేపీ ఎంపీ తీరును, బీజేపీని కాంగ్రెస్ విమర్శిస్తోంది.
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధాలను గెలవడానికి రక్షణ వనరులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని సూచించారు. సైన్యాన్ని బలోపేతం చేయడానికి, యుద్ధాలను గెలవడానికి సాంకేతికత, సప్లై చైన్, జాతీయ నిల్వల వంటి రక్షన వనరులను ఉపయోగించుకుని మెరుగు పడాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అన్నారు. జిన్ పింగ్ ఈ వారంలో మూడోసారి సాయుధ దళాల సర్వసైన్యాధ్యక్షుడి హోదాకు తిరిగి ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి సైన్యం వార్షిక ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.
US Intelligence Report: అమెరికా ఇంటెలిజెన్స్ భారత్, పాక్ సంబంధించి కీలక విషయాలను వెల్లడించింది. అమెరికా ఇంటెలిజెన్స్ ఆన్యువల్ థ్రెట్ అసెస్మెంట్ ప్రకారం.. పాకిస్తాన్ ఏదైనా కవ్వింపుచర్యలకు పాల్పడితే సైనికంగా ప్రతిస్పందించేందుకు భారతదేశం గతం కన్నా ఎక్కువ అవకాశం ఉందని వెల్లడించింది.
H3N2 Virus: ఇన్ ఫ్లూయెంజా ఏ సబ్ టైప్ హెచ్3ఎన్2 వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా లక్షణాలు ఉండటంతో జనాలు భయపడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ నగరం జ్వరంతో అల్లాడిపోతోంది. అక్కడ దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాన్పూర్ లోని హాల్లెట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క రోజులోనే జ్వరంతో, ఇతర జలుబు లక్షణాతో 200 కేసులు వచ్చాయి. వీరిలో 50 మందికి ఆస్పత్రిలో […]
Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా కిరాతకంగా వ్యవహరిస్తోంది. సైనికుల హక్కులను కాలరాస్తూ వ్యవహరిస్తోంది. ఇటీవల బఖ్ ముత్ పోరులో ఉండగా ఓ ఉక్రెయిన్ సైనికుడు రష్యా దళాలకు చిక్కాడు. అతడిని నిలబడిన చోట కాల్చి చంపేశారు రష్యా సైనికులు. ఈ వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలిదిమిర్ జెలన్ స్కీ షేర్ చేశారు. రష్యా యుద్ధనేరాలకు పాల్పడుతుందని ఆరోపించారు. హంతకులను కనుక్కుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశాడు.
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇళ్లు ముంబై లోని మన్నత్ బంగ్లాలోకి ఇద్దరు అక్రమంగా చొరబడ్డారు. ఏకంగా 8 గంటల పాటు ఇద్దరు బంగ్లాలోని షారూఖ్ ఖాన్ మేకప్ రూంలో దాక్కుని ఉన్నారు. షారూఖ్ ఫ్యాన్స్ అయిన ఇద్దరు అతడిని కలిసేందుకు ఇదంతా చేశారు. చివరకు వీరిద్దరిని చూసి షాక్ అవ్వడం షారూక్ వంతైంది. ఈ ఘటన గత వారం జరిగింది. నిందితులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Archana Gautam: బిగ్ బాస్ ఫేమ్ అర్చనా గౌతమ్ కు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పీఏ తనను చంపేస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు అర్చనా గౌతమ్. ఈ విషయమై మీరట్ లోని పార్తాపూర్ పోలీస్ స్టేషన్ లో అర్చనా గౌతమ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఈరోజు నోటీసులు ఇచ్చింది. మార్చి 9న విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మోదీని ప్రశ్నిస్తున్నందుకే సీఎం కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. మరోవైపు మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గపడ్డాయని తెలంగాణ మంత్రులు దుయ్యబడుతున్నారు.
Minister Jagadish Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
India at UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తింది. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ జమ్మూ కాశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగానే స్పందించింది. మహిళలు, శాంతి మరియు భద్రతపై భద్రతా మండలి చర్చలో పాక్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ మానవహక్కులపై తప్పుడు ఆరోపణలు చేసింది. ఈ వ్యాఖ్యలపై భారత్ విరుచుకుపడింది. ఇటువంటి ద్వేషపూరిత, తప్పుడు ప్రచారాలకు భారత్ స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొంది.