Madhya Pradesh: మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలవంతపు మతమార్పుడిలకు అడ్డుకట్ట వేస్తోంది. అక్కడి బీజేపీ ప్రభుత్వం వీటిపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా బైబిల్ బోధించినందుకు, విద్యార్థులను చర్చిలోకి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్ పై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రిన్సిపాల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాండ్లాలో జరిగింది. ప్రిన్సిపాల్ పై అభియోగాలు నమోదు అయ్యాయి. హాస్టల్ సూపరింటెండెంట్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసు అధికారులు శుక్రవారం తెలిపారు.
Read Also: Physically Harassment : అర్థరాత్రి రోడ్డుపై యువతి.. అక్కడ చేయివేసి వేధించిన పోలీసు
మావై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘోరేఘాట్ పంచాయతీ ప్రాంతంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలను సందర్శించిన బాల్ కళ్యాణ్ సమితి కార్యకర్త యోగేళష్ పరాశర్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులును స్కూల్ ప్రిన్సిపాల్ పాధర్ జీబి సెబాస్టియన్, హాస్టల్ సూపరింటెండెంట్ కున్వర్ సింగ్ గా గుర్తించారు. ప్రస్తుతం కున్వర్ సింగ్ ను అరెస్ట్ చేయగా.. సెబాస్టియన్ పరారీలో ఉన్నాడు.
ఇటీవల బాల కళ్యాణ్ సమితి సభ్యులు ఓంకార్ సింగ్, అనురాగ్ పాండే మార్చి 4న పాఠశాల హాస్టల్ ను ఆకస్మికంగా సందర్శించారు. పిల్లలు తమకు బైబిల్ పాఠాలు నేర్చుకుంటున్నారిన, చర్చికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు. బాల కార్మిక చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్, మతపరమైన చట్టాల కింద కేసు నమోదు చేశారు.