Maruti Suzuki Brezza CNG: అన్ని ప్రముఖ ఆటో కార్ మేకర్స్ ఈవీపై దృష్టి సారిస్తుంటే.. ఇండియాలో అతిపెద్ద కార్ మార్కెట్ ను కలిగి ఉన్న మారుతి సుజుకీ మాత్రం సీఎన్‌జీ కార్లపై కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఇప్పటికే మారుతి నుంచి ఆల్టో, వ్యాగర్ ఆర్, స్విఫ్ట్, ఎర్టిగా సీఎన్‌జీ మోడల్స్ మార్కెట్ లోకి వచ్చాయి. అయితే తాజాగా తన ప్లాగ్ షిస్ మోడల్ బ్రెజ్జాను సీఎన్‌జీలో తీసుకురాబోతోంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది ద్వితీయార్థంలో బ్రెజ్జా సీఎన్‌జీ మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.
కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో దేశంలో ఇప్పటీకీ బ్రెజ్జా టాప్ 1గా ఉంది. టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్ర XUV300 కార్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం బ్రెజ్జాలో కేవలం పెట్రోల్ ఆప్షన్ మాత్రమే ఉంది. దీనికి ప్రత్యర్థిగా ఉన్న కార్లలో పెట్రోల్, డిజిల్ రెండు వేరియంట్లు ఉన్నాయి. అయితే బ్రెజ్జా మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేందుకు సీఎన్‌జీ మోడల్ తో రానుంది. అయితే చాలా మంది సీఎన్‌జీ ఇంజన్ పై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని భావిస్తుంటారు. అయితే మారుతి మాత్రం S-CNG క్లీన్ ఫ్యూయల్ తో నిడిచే విధంగా తయారు చేయబడింది.
బ్రెజ్జా CNG వేరియంట్‌లు:
బ్రెజ్జా CNG వెర్షన్ మూడు వేరియంట్లలో లభించనుంది. LXi, VXi , ZXi వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. అయితే ZXI+ పెట్రోల్ వెర్షన్ లో ఉంది. దీన్ని సీఎన్‌జీ మోడల్ లో తీసుకురాకూడదని మారుతి అనుకుంటుంది. ధర విషయానికి వస్తే పెట్రోల్ మోడల్ తో పోలిస్తే అన్ని వేరియంట్లపై రూ. 95,000 అధికంగా ఉండే అవకాశం ఉంది. వేరియంట్లను బట్టి ఈ కింది విధంగా ఎక్స్ షోరూం ధరలు ఉంటాయి.
వేరియంట్ సీఎన్‌జీ పెట్రోల్ ధరలో తేడా
LXi రూ. 9,14,000 రూ.8,19,000 రూ 95,000
VXi రూ. 10,49,500 రూ.9,54,500 రూ. 95,000
ZXi రూ. 11,89,500 రూ.10,94,500 రూ. 95,000
ZXi రూ. 12,05,500 రూ.11,10,500 రూ. 95,000
డ్యూయల్ టోన్
బ్రెజ్జా CNG ఇంజిన్, ట్రాన్స్మిషన్, మైలేజ్
SUV K-సిరీస్ 1.5 లీటర్ డ్యుయర్ జెట్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్ తో బ్రెజ్జా వస్తోంది. సీఎన్జీ మోడ్ లో గరిష్టంగా 89 పీఎస్ పవర్, 121ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ మోడ్ లో 101 పీఎస్ పవర్, 136ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో వస్తుంది. అయితే సీఎన్జీ మోడల్స్ ఆటో ట్రాన్స్మిషన్ ఆప్షన్ లేదు. కంపెనీ చెబుతున్న దాని ప్రకారం సీఎన్జీ కిలోకు 25.51 మైలేజ్ ఇస్తుంది.
ఫీచర్లు..
ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ పుష్ స్టార్ట్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లను ఉన్నాయి.ఇంటిగ్రేటెడ్ పెట్రోల్ మరియు CNG ఇంధన లిడ్, CNG డ్రైవ్ మోడ్, డిజిటల్ అండ్ అనలాగ్ CNG ఫ్యూయల్ గేజ్‌లు మరియు ఇల్యూమినేటెడ్ ఫ్యూయల్ చేంజ్-ఓవర్ స్విచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.