CJI D.Y. Chandrachud: లివ్ ఇన్ రిలేషన్ షిప్ పై దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజీవనంలో ఉండే జంట రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధనలు తేవాలని కోరతూ.. ఓ లాయర్ పిల్ దాఖలు చేశారు. సహజీవనం చేసే జంటలకు సామాజిక భద్రత కల్పించాలని కోరారు. దీని వల్ల లివ్ రిలేషన్ లో జరిగే నేరాలు తగ్గిపోతాయని పిటిషన్లో కోరారు.
Read Also: Kunamneni Sambasiva Rao : కేంద్ర ప్రభుత్వ హామీలు అమలు కోసం ప్రజా పోరు యాత్ర
దీనిపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమిటి, ఇలాంటి కేసుతో జనాలు ఇక్కడికి వస్తారా..? మేను ఇలాంటి కేసులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో రిజిస్ట్రేషన్ చేయాలి..? కేంద్ర ప్రభుత్వంతోనా..? అంటూ ప్రశ్నించారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తులతో కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం..? అని అడిగారు.
మీరు ఈ వ్యక్తులకు భద్రత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారా..? లేక వ్యక్తులు లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉండనివ్వకుండా చేస్తున్నారా.? అంటూ వ్యాఖ్యానించారు. కేవలం తక్కువ బుర్రతో ఇది చేస్తున్నారు అని కోపంగా పిటిషన్ ను తిరస్కరించారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ రిజిస్ట్రార్ గా కేంద్రం ఉండాలని పిటిషనర్ కోరారు. అయితే ఏ కారణాల వల్ల భద్రత కల్పించాలని కోరుతున్నారు అని చంద్రచూడ్ ప్రశ్నించారు. ఇటీవల ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ను లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేసి 35 ముక్కలుగా శరీర భాగాలను కట్ చేశాడు. ఈ ఘటన తర్వాత ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.