Punjab: పంజాబ్‌లో పరిస్థితి ఆందోళనకరమట.. కెనడా, యూకే ఎంపీల మొసలి కన్నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్ పోలీసులు, కేంద్రబలగాలు ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతున్నాయి. గత రెండు రోజులుగా అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన మద్దతుదారులు 78 మందిని లోపలేశారు. ఇదిలా ఉంటే కొంతమంది కెనడా, యూకే సిక్కు ఎంపీలు మాత్రం పంజాబ్ పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కెనడా ఎంపీ జస్‌రాజ్ సింగ్ హలన్.. భారతదేశంలోని పంజాబ్ నుంచి వస్తున్న నివేదికల గురించి చాలా ఆందోళన చెందుతున్నామని, ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది, కొన్ని ప్రాంతాల్లో నలుగురి కన్నా ఎక్కువ వ్యక్తులు సమావేశాలు కావద్దని ఆంక్షలు విధించింది, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఆదివారం ట్వీట్ చేశారు. కెనడాకు చెందిన మరో ఎంపీ రణదీప్ ఎస్ సరాయ్ కూడా ఇదే విధంగా అభిప్రాయాన్ని తెలియజేశారు.
Also Read
Read Also: Illegal Affair: పెళ్లాం ప్రెగ్నెంట్.. ఆమె నా గర్ల్ ఫ్రెండ్.. తెగించిన కానిస్టేబుల్
పంజాబ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ కారణంగా యూకేలో ఉన్న కుటుంబీకులు పంజాబ్ లో ఉన్న తమవారి కోసం ఆందోళన చెందుతున్నారని యూకే సిక్కు ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ విధించడం, సామూహిక అరెస్టులకు పాల్పడుతున్నారని, భారత్ నుంచి ఆందోళనకర నివేదికలు అందుతున్నాయని, ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని, మానవహక్కులను గౌరవించాలని చెబుతూ.. యూకే ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీ ట్వీట్ చేశారు.
అయితే ధేసీ ప్రకటనపై కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో ఖలిస్తానీ భావాలను పెంపొందిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జనాభా మద్దతు ఎక్కువగా ఉండే స్లాఫ్ నియోజకవర్గంలో కొత్త ఓట్లను ఈ ప్రకటనల ద్వారా సంపాదించుకోలేరు అని ట్వీట్ చేశారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు