Rahul Gandhi:‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ క్రిమినల్ పరువునష్టం కింద ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ కేసులో సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో కర్ణాటక కోలార్ లో పర్యటిస్తూ ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ దొంగలందరికి మోదీ ఇంటిపేరు ఎందుకు ఉంటుంది’’ అని ప్రశ్నించారు. ఈ కేసులో రెండేళ్లు శిక్ష విధించిన కోర్టు, 30 రోజలు బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునేందుకు…
Covid-19: భారతదేశంలో మరోసారి కరోనా పడగవిప్పుతోంది. నెమ్మదిగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం కేసుల సంఖ్య కేవలం వెయ్యికి దిగువన మాత్రమే ఉండేవి. అయితే తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన గణాంకాల ప్రకారం గత రెండు రోజుల్లో 1000 పైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1300 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 140 రోజుల తర్వాత ఇదే అత్యధికం.
Arvind Kejriwal: ‘మోదీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఈ రోజు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్షను విధించింది. ఆ తరువాత 30 రోజలు పాటు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఈ కేసుపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కుట్రతో బీజేపీ నాయకులు విపక్షాలను భయపెడుతోందని, గుజరాత్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని ఆయన అన్నారు.
Amritpal Singh: ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం ఆరో రోజు పంజాబ్ పోలీసులు వేట సాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా పంజాబ్ అంతటా గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే అమృత్ పాల్ సింగ్ పోలీసులు, కేంద్ర బలగాల కళ్లుకప్పి పారిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం 5 వాహనాలను మారుస్తూ అతడు పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గత శనివారం నుంచి అమృత్ పాల్ సింగ్ మామతో సహా 120 మందిని అరెస్ట్ చేశారు.
Modi Surname Case: కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. 2019లో ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలపై పరువునష్టం కేసులో శిక్షను ఎదుర్కోనున్నారు. శిక్ష విధించిన తర్వాత సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 30 రోజుల బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. అంతకుముందు రోజు సూరత్ కు వచ్చిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
Indeed Layoff: అమెరికాకు చెందిన ప్రముఖ జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ ఇండీడ్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. టెక్ లేఆఫ్స్ జరుగుతున్న ప్రస్తుతం కాలంలో తాము కూడా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంటే కంపెనీ నుంచి 15 శాతం ఉద్యోగులను తొలగించనుంది. సీఈఓ క్రిస్ హైమ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండీడ్ లో మొత్తం 14,600 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపుగా అన్ని విభాగాల నుంచి కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
Media persons Protection Bill: జర్నలిస్టుల రక్షణ కోసం చత్తీస్ గఢ్ ప్రభుత్వం ‘ ఛత్తీస్గఢ్ మీడియా పర్సన్స్ ప్రొటెక్షన్ బిల్లు 2023 ’ను తీసుకువచ్చింది. బుధవారం ఆ రాష్ట్ర శాసనసభలో దీన్ని ఆమోదించారు. ఇది చారిత్రాత్మక రోజు అని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అభివర్ణించారు. ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా.. స్పీకర్ చరదాస్ మహంత్ తిరస్కరించారు. ఛత్తీస్గఢ్లో 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు రక్షణ కల్పించే చట్టాన్ని…
Sharada Peeth: హిందూ భక్తుల కోసం కేంద్ర సరికొత్త కారిడార్ నిర్మించాలని యోచిస్తోంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఉన్న ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను భారత్ తో కలపాలని భావిస్తోంది. పంజాబ్ లోని కర్తార్ పూర్ కారిడార్ తరహాలో శారదా పీఠ్ యాత్ర కోసం పీవోకే కారిడాన్ ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Great Love Story: టీనేజ్ లవ్ కానీ పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. దీంతో 60 ఏళ్ల పాటు ఎడబాటును భరించారు. చివరకు లేటు వయసులో పెళ్లితో ఒకటయ్యారు. ఈ గ్రేట్ లవ్ స్టోరీ ప్రస్తుతం బ్రిటన్ లో హాట్ టాపిక్ గా మారింది. 1963లో లెన్ 19 ఏళ్లు, జీనెట్ కి 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. న్యూ పోర్ట్ లోని సెయింట్ మేరీస్ హాస్పిటన్ లో నర్సులుగా పనిచేస్తున్నప్పుడు తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపనలు చేశారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ( పీఎంఎల్-ఎన్) ప్రభుత్వం నన్ను చంపేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన మద్దతుదారులతో వీడియో ప్రసంగంలో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు. గతేడాది ఆయనపై హత్యప్రయత్నం జరిగింది. 1996లో బెనజీర్ భుట్టో అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ కాల్పుల్లో మరణించిన ముర్తాజా భుట్టో తరహాలోనే తనను హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని బుధవారం అన్నారు.