UK Parliament: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తాని మద్దతుదారులు దాడులు అంశాన్ని యూకే హౌస్ ఆఫ్ కామన్స్‌లో గురువారం లేవనెత్తారు. బ్రిటన్ ఎంపీలు ఖలిస్తానీ పోకిరీలపై చర్యలు తీసుకోవాలని, భారత దౌత్యసిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్‌మన్ పార్లమెంట్‌లో చర్చను తేవనెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ గారెత్ థామస్ మాట్లాడుతూ.. అలాంటివి పునరావృతం కాకుండా ప్రధాని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
పార్లమెంట్ లో క్యాబినెట్ మంత్రి పెన్నీమోర్డాంట్ మాట్లాడుతూ.. భారత రాయబార కార్యాలయం రక్షణ చర్యలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. హైమిషన్ వెలుపల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. భారత హైకమిషన్ పై ఇటీవల ఆరుసార్లు దాడులు జరిగినట్లు ఎంపీ బ్లాక్‌మన్ పార్లమెంట్ లో లేవనెత్తారు. ఆదివారం హైమిషన్ ముందు ఖలిస్తానీ పోకిరీలు చేసి చర్యల దేశానికి అవమానకరం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తానీ మిలిటెంట్లు పనిచేస్తున్నారు, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఇలాంటి దాడులను చూశామని, మనం ప్రస్తుతం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామని, వీరిని దేశంలో నిషేధించాలని ఆయన అన్నారు.
Read Also: Akshara Gowda: ఎద అందాలను వంగి మరీ చూపిస్తుందిగా
ఈ అంశానికి ముందు బ్లాక్‌మన్ భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి యూకే పార్లమెంట్ లో లేవనెత్తారు. ఇరుదేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని, కలిసి పనిచేస్తామని మంత్రి నిగెల్ హాడిల్ స్టన్ అన్నారు. గతేడాది దీపావళికే ఈ ఒప్పందం పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా అమలులోకి రాలేదు.
లండన్ లో భారత హైకమిషన్ పై గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత జెండాను అవమానపరిచారు. బుధవారం ఇంక్ బాటిళ్లు, గుడ్లు, నీటి సీసాలు విసిరారు. ఆదివారం జరిగిన దాడి తర్వాత బుధవారం హైకమిషన్ ముందు భారీగా బలగాలను మోహరించారు. మరోసారి దాడి జరగకుండా లండన్ పోలీసులు నిలువరించారు. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయనకు మద్దతుగా బ్రిటన్ లోని ఖలిస్తానీ వాదులు నిరసన తెలుపుతున్నారు.