ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. నాబార్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (నాబ్ఫిన్స్) కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నియామకాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అభ్యర్థులు PUC/10+2 (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంకా, అభ్యర్థి గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు మించకూడదు. అయితే, రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్ లైన్ విధానంలో నవంబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Also Read:Heart Attack Causes: చిన్న వయసులో గుండెపోటుకు కారణాలు ఇవే..
నాబార్డ్ గ్రేడ్ ఎ పోస్టులు
ఈ నియామకంతో పాటు, నాబార్డ్‌లో ఖాళీగా ఉన్న 92 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఎ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నవంబర్ 30 వరకు కొనసాగుతుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నియామకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.