ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ టీవీల వాడకం ఎక్కువైపోయింది. నేడు, స్మార్ట్ టీవీలు బిగ్ స్క్రీన్‌లతో రావడమే కాకుండా, అవి పూర్తి ఎంటర్ టైన్ మెంట్ సిస్టమ్ గా కూడా మారాయి. OTT యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ప్రజలు ఇప్పుడు సాధారణ టీవీలకు బదులుగా స్మార్ట్ టీవీలను కొనడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్లో అనేక రకాల స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి పేరుకు స్మార్ట్‌గా ఉంటాయి, కానీ అవి చాలా ఫీచర్లను కలిగి ఉండడంలేదు. కాబట్టి, మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తుంటే, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మీరు కొనుగోలు చేస్తున్న టీవీలో ఈ ఐదు ఫీచర్లు తప్పనిసరిగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం మరిచిపోవద్దు.
Also Read:Karumuri Venkata Reddy Arrest: మరో వైసీపీ నేత అరెస్ట్.. అసలు కారణం ఏంటి..? అని అంబటి ఫైర్
రిఫ్రెష్ రేట్, డిస్ప్లే ప్యానెల్
ముందుగా, స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేటప్పుడు, దాని స్క్రీన్ ప్యానెల్‌ను గమనించాలి. కనీసం IPS లేదా VA ప్యానెల్ ఉన్నదాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. ఇది మెరుగైన కలర్, బ్రైట్ నెస్ ను అందిస్తుంది. అదనంగా, టీవీ కనీసం 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండాలి.
యాప్ సపోర్ట్, ఆపరేటింగ్ సిస్టమ్
టీవీ ఏ OS కి మద్దతు ఇస్తుందో తనిఖీ చేయండి, అంటే అది Android TV అయినా లేదా Google TV అయినా. Google TV, Android TV అతిపెద్ద యాప్‌ల ఎకో సిస్టమ్ ను అందిస్తాయి. అలాగే, Netflix, Prime Video, Hotstar వంటి అన్ని ముఖ్యమైన యాప్‌లు టీవీలో మద్దతు ఇస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
ప్రాసెసర్, RAM స్టోరేజ్
మీ టీవీ చాలా కాలం పాటు సజావుగా పనిచేయాలంటే, దాని ప్రాసెసర్, RAM చాలా కీలకం. యాప్‌లు సజావుగా పనిచేయాలంటే కనీసం 2GB RAM, 8GB నుండి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న టీవీని ఎంచుకోండి.
ధ్వని క్వాలిటీ
టీవీలో వీడియో ఎంత ముఖ్యమో, మంచి సౌండ్ క్వాలిటీ కూడా అంతే ముఖ్యం. టీవీ కొనడానికి ముందు, దాని స్పీకర్ అవుట్‌పుట్, డాల్బీ ఆడియో లేదా DTS సపోర్ట్‌ను తప్పకుండా తనిఖీ చేయండి. టీవీ మంచి సౌండ్‌ను అందించకపోతే, మీరు తర్వాత సౌండ్‌బార్ కొనుగోలు చేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి రావచ్చు.
Also Read:IBomma Ravi: హిట్ 3 లీక్.. పాపం ఎంప్లాయ్స్ ని అనుమానించారు కదరా!
కనెక్టివిటీ ఆప్షన్స్
చాలా మంది టీవీ కొనుగోలు చేసేటప్పుడు పోర్ట్‌లను జాగ్రత్తగా తనిఖీ చేయరు, దీనివల్ల తర్వాత సమస్యలు తలెత్తవచ్చు. టీవీలో HDMI 2.0 లేదా 2.1 పోర్ట్‌లు ఉన్నాయని, వాటితో పాటు USB పోర్ట్‌లు, బ్లూటూత్, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉన్నాయో లేదో చెక్ చేసకోవాలి.