2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, సల్మాన్ అలీ అఘా పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్య బ్రిగేడ్ ఆత్మవిశ్వాసంతో మరోసారి పాక్ ను మట్టికరిపించేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం […]
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. సేవలను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ ఓ కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. పాస్‌బుక్ లైట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఖాతాదారులు తమ మొత్తం పీఎఫ్ ఖాతా వివరాలను లాగిన్ అవ్వకుండానే ఒకే క్లిక్‌తో తెలుసుకోవచ్చు. మీ పీఎఫ్ ఖాతా వివరాలను పోర్టల్ నుండి నేరుగా వీక్షించవచ్చు. ఇప్పటి వరకు, మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ లేదా లావాదేవీలను తనిఖీ చేయడానికి విడిగా పాస్‌బుక్ పోర్టల్‌లోకి లాగిన్ […]
ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పి. సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో న్యాయవ్యవస్థకు సంబంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు. Also Read:Shiva Re-Release : […]
పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని నిర్ధారించుకున్న అనంతరం బీఆర్ఎస్ నుంచి కవితను కేసీఆర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం కవిత బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది. తాజాగా కొత్త రాజకీయ పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నాను అని వెల్లడించారు. తండ్రి పార్టీ […]
సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 61 మందిని అరెస్ట్ చేశారు. ఒక్క ఆగస్టులోనే 338 ఫిర్యాదులు – వాటిలో 233 కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కాంలు, ఇన్వెస్ట్మెంట్, లోన్ ఫ్రాడ్స్, ఇన్సూరెన్స్, సోషల్ మీడియా, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. తమిళనాడు (20), గుజరాత్ (18), కర్ణాటక (16), మహారాష్ట్ర (13), ఢిల్లీ (13), ఆంధ్రప్రదేశ్ (7) మందిని […]
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి […]
నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం జరుగనున్నది. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. సమీక్ష కి డిప్యూటీ సీఎం భట్టి.. మంత్రి పొన్నం… తదితరులు హాజరుకానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపద్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. న్యాయ నిపుణులను కూడా సమావేశానికి ప్రభుత్వం పిలిచింది. Also Read:Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు.. […]
గోల్డ్ కొనడం ఇకపై కలగానే మిగిలేలా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారీగా ధర పెరుగుతూ షాకిస్తోంది బంగారం. తులం గోల్డ్ ధర ఇప్పటికే రూ. లక్షా 12 వేలు దాటింది. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోయేలా ఉంది. నేడు గోల్డ్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 820 పెరిగింది. కిలో వెండి ధర రూ. 2000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర […]
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో బంధువుల ఇంట్లో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దంపతులు మంజుల, శంకర్ లు బాంబే నుంచి రెండు నెలల క్రితమే హైదరాబాద్ కి వచ్చి ఉంటున్నట్లు గుర్తించారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు […]
కూతురు పుడితే మా ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని మురిసిపోయే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే తండ్రి మాత్రం కూతురు పాలిట యముడిలా మారాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. 12 నెలల కూతురుని కడతేర్చాడు తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రాత్రి వేళ భార్యతో గొడవకు దిగాడు […]