Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు
- ఇకపై 18 నక్షత్రాలు
- జూన్ 1, 2026 నుండి ఇండియన్ రైల్వేస్ అధికారిక లోగోలో 18 నక్షత్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ రైల్వేస్ (IR) చరిత్రలో మరో మైలురాయి. జూన్ 1, 2026 నుండి ఇండియన్ రైల్వేస్ అధికారిక లోగోలో 18 నక్షత్రాలు చేర్చనున్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 17 నక్షత్రాల స్థానంలో ఈ మార్పు జరగనుంది. ఈ మార్పుకు కారణం ఏమిటంటే.. భారతదేశంలో దక్షిణ తీర రైల్వే జోన్ (South Coast Railway – SCoR) అనేది 18వ జోనల్ రైల్వేగా జూన్ 1, 2026 నుండి అమలులోకి వస్తోంది. దీని ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ లోగోలోని నక్షత్రాలు దేశంలోని జోనల్ రైల్వేల సంఖ్యను సూచిస్తాయి.
కాబట్టి కొత్త జోన్ ఏర్పాటుతో లోగోను అప్డేట్ చేయాల్సి వచ్చింది. అన్ని రైల్వే స్టేషన్లు, కార్యాలయాలు, రైలు టికెట్లు, అధికారిక వెబ్సైట్లు, యాప్‌లు, యూనిఫాంలు, లెటర్హెడ్లు మొదలైన అన్ని ప్రదేశాల్లో కొత్త 18 నక్షత్రాల లోగో ఉపయోగించనున్నారు. ఈ మార్పు భారత రైల్వేల అభివృద్ధి, ప్రాంతీయ సమతుల్యతకు ఒక సంకేతం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంది.
Also Read
- CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
SCoR గురించి కొన్ని ముఖ్యాంశాలు
ప్రధాన కార్యాలయం: విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
ఏర్పాటు తేదీ: జూన్ 1, 2026
జోన్ సంఖ్య: 18వ జోన్
ఇంతకు ముందు 17 జోన్లు మాత్రమే ఉండేవి
విజయవాడ, గుంటూరు, గుంటకల్ డివిజన్లు (సౌత్ సెంట్రల్ రైల్వే నుండి), విశాఖపట్నం డివిజన్ (పాక్షికంగా) దీనికి చేర్చబడ్డాయి
రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్ ప్రకటన
ఏప్రిల్ చివరి వారంలో విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తర్వాత చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ డిమాండ్ ఇప్పుడు నెరవేరింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
The Paradise Collections: నాని ఊచకోత.. కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!
-
Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
-
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!