RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
- 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు
- ఆన్ లైన్ దరఖాస్తులను మే 15 నుండి జూన్ 14, 2026 వరకు స్వీకరిస్తారు
- 10వ తరగతితో పాటు ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ అందించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అసిస్టెంట్ లోకో పైలట్ నియామకాల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకం ద్వారా మొత్తం 11,127 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ దరఖాస్తులను మే 15 నుండి జూన్ 14, 2026 వరకు స్వీకరిస్తారు. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
అర్హతలు
రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్మెంట్ 2026కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి 10వ తరగతితో పాటు ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి, లేదా 10వ తరగతితో పాటు ఇంజనీరింగ్‌లో డిప్లొమా పొంది ఉండాలి. ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. గరిష్ట వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇతర రిజర్వ్డ్ కేటగిరీలు, మాజీ సైనికులకు కూడా నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జూలై 1, 2026ను దృష్టిలో ఉంచుకుని వయస్సును లెక్కిస్తారు.
Also Read
- Layoffs: లేఆఫ్స్ బాటలో డిస్నీ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ పోటీ తట్టుకోలేక కీలక నిర్ణయం..
- November School Holidays: ఈనెలలో భారీగా సెలవులు.. ఏకంగా 8 నుంచి 13 రోజులు పాఠశాలలకు హాలిడేస్..
- School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Aryan Shukla: ఏఐ కంటే స్పీడ్‌గా లెక్కలేసే భారతీయ కుర్రాడు..16 ఏళ్లకే 9 గిన్నిస్ రికార్డులు, అనేక బంగారు పతకాలు..
దరఖాస్తు రుసుము
దరఖాస్తు ఫారం నింపడంతో పాటు, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది, కాగా ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గాల వారు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. సీబీటీ 1 తర్వాత, జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.400 ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు పూర్తి ఫీజు వాపసు ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ నియామకంలో ఎంపికైన అభ్యర్థులు మొదట మొదటి దశ (CBT-1), రెండవ దశ (CBT-2)లో పాల్గొనవలసి ఉంటుంది. ఆ తర్వాత వారు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ (ME)లకు హాజరవుతారు. అన్ని దశలు పూర్తయ్యాక, తుది జాబితా విడుదలవుతుంది. ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు ఖాళీగా ఉన్న పోస్టులలో నియామిస్తారు. ఎంపికైన తర్వాత, లెవెల్ 2కు రూ.19,900 ప్రారంభ వేతనం లభిస్తుంది.
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలే లాభాలు.. ధైర్యంతో పెట్టుబడి పెట్టిన వారికి వరించిన ధనలక్ష్మి..
-
Qualcomm Layoffs: హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్కామ్ ఉద్యోగులకు బిగ్ షాక్..
-
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
-
Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. మ్యూజియం, మెట్రో సహా అభివృద్ధి పనులకు రూ.77,101 కోట్లు
-
Priya Bhavani Shankar Wedding: సైలెంట్‌గా ఏడడుగులు వేసిన హీరోయిన్.. 10 ఏళ్ల ప్రేమకు శుభం కార్డు!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!