రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని పోలీసులు చేధించారు. యాకుత్ పూరా కు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. టౌలీ చౌకీ కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్ గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను బలవంతంగా ఆటో లో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్ […]
కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా పై కౌంటర్ దాఖలు చేశారు బండి సంజయ్. బండి సంజయ్ కుమార్ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొన్న ప్రధాన అంశాలు.. తాను చేసిన వ్యాఖ్యలు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఉన్నాయని బండి సంజయ్ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల కోసం ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయని నిందితులు ఒప్పుకున్నారని అఫిడవిట్లో తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర గురించి తనకు తెలియదని […]
రేపు మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం జాతరను మరింత ఘనంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. ఇంతకాలం మేడారం జాతరకు ప్రభుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు చేసేవి. జాతర నిర్వహణపై సమీక్షకు సైతం గతంలో ముఖ్యమంత్రులు పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర ఏర్పాట్లపై […]
మాజీ డీఎస్పీ నళిని తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని ఇష్యూ పై స్పందించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును నళిని ఇంటికి పంపించారు. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీని కలిశారు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. నళినిని కలెక్టర్ కలిసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం కావాలన్నా..ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు కలెక్టర్ ఆమెకు […]
బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. బంగారం పై ఇన్వెస్ట్ చేసిన వారికి మాత్రం కాసులు కురిపిస్తోంది. ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే 40% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే, అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదు సంవత్సరాలలో బంగారం […]
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) IBPS PO, క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. నిర్ణీత తేదీలలోపు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇప్పుడు సెప్టెంబర్ 28, 2025 లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 13,217 పోస్టులను భర్తీ చేయనున్నారు. […]
హైదరాబాద్ లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎస్సార్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్, ఫిలింనగర్లో ప్రాంతాలలో వర్షం దంచికొడుతోంది. కుండపోతగా కురుస్తున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. కాగా గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. […]
ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్నం తింటుండగా కూర వేయలేదని.. మహిళను గొడ్డలితో నరికి చంపాడు రవి అనే వ్యక్తి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖమ్మం నగరంలోని ఖానాపురం ఇండస్ట్రీయల్ ప్రాంతంలో కిటికీలు తయారు చేసే ఓ కంపెనీ లో బానోత్ రుక్మిణీ, రవిలు పని చేస్తున్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం సమయంలో అన్నం తింటుండగా కూర వేయమని రవి రుక్మిణీ నీ అడిగాడు. రుక్మిణీ తనకు సరిపోను కూర మాత్రమే […]
ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ లో గాడ్జెట్స్ పై కళ్లు చెదిరే డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. రూ. 500 కంటే తక్కువ ధరకే గాడ్జెట్స్ లభించనున్నాయి. ఈ సేల్ సెప్టెంబర్ 23న Amazon-Flipkart ప్లాట్ఫామ్లో ప్రారంభమవుతుంది. ముందస్తు యాక్సెస్ ఇప్పటికే ప్రారంభమైంది. సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలపై గణనీయమైన తగ్గింపులను అందిస్తున్నాయి. Also Read:GST 2.0 […]
రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందుకు పెండింగ్ భూసేకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై సమీక్షలో చర్చించారు. వీలైనంత త్వరగా రూట్ మ్యాప్ పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్- శ్రీశైలం హైవే లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం […]