మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బై ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎల్లుండి సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్(డిల్లి లో) జరుగనుంది. తెలంగాణ జూబ్లీహిల్స్ అభ్యర్థి నీకేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ రోజు సమావేశం అయిన బీజేపీ ముఖ్య […]
శంషాబాద్ విమానాశ్రయంలో మరో మారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ల్యాండింగ్ అయ్యింది. అంటోనోవ్ ఎన్ 124 సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటోనోవ్ ఎన్ 124 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలలో ఒకటి. క్వాడ్ ఇంజిన్ అంటే 4 ఇంజన్లు ఉన్నాయి. 24 చక్రాలు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటి, దీనిలో లాంగ్ ట్రక్కులు నేరుగా లోడింగ్, అన్లోడ్ కోసం రాంప్లను ఉపయోగించి […]
ఇటీవలి కాలంలో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఆరోగ్య సమస్యల్లో గుండెపోటు ఒకటి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. నిత్యం పోషకాహారం, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, వ్యాయామం చేసేటువంటి సెలబ్రిటీలు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ చిత్రం “టైగర్ 3″లో నటించిన ప్రముఖ పంజాబీ నటుడు, ప్రొఫెషనల్ వెజిటేరియన్ బాడీబిల్డర్ వరీందర్ సింగ్ ఘుమాన్ అమృత్సర్లో గుండెపోటుతో మరణించారు. ఆయనకు 41 సంవత్సరాలు. […]
కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ ఆపరేషన్ తో మావోలు అడవిని వీడి జనంబాట పడుతున్నారు. ఇప్పటికే పలువురు మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా మరో ముగ్గురు సీనియర్ మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. ముగ్గురు స్టేట్ కమిటీ సభ్యులు జన జీవన స్రవంతి లో కలిశారని తెలిపారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ […]
ప్రభుత్వాఫీసుల్లో లంచగొండి అధికారులను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని అవగాహన కల్పించాల్సిందిపోయి కంచె చేను మేసినట్లుగా లంచాలకు తెగబడుతున్నారు కొందరు అధికారులు. తాజాగా తార్నాకలోని టీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు సుధాకర్ రెడ్డి. కొత్త ట్రాన్స్ఫర్మర్ కోసం కాంట్రాక్టర్ వద్ద రూ. 15000 […]
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామనికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితులు, రాజు, రాజేశం అనే వ్యక్తులకు జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 15000/- రూపాయల జరిమానా విధిస్తూ 1వ అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీ నారాయణ తీర్పు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గూడెం గ్రామానికి చెందిన దుర్గయ్య ( 60 )సంవత్సరాల వ్యక్తి అదే గ్రామంలో బండ కొట్టే పనిచేస్తూ జీవనం […]
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి నిరూపితమయ్యాయి. గుంట భూమి కోసం కన్న కొడుకుని పొట్టనబెట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు. రక్తం పంచినోళ్లే రక్తపాతం సృష్టించారు. మానవ సంబంధాలను మంటగలిపేశారు. అతని స్వంత తల్లిదండ్రులు, తోబుట్టువులే కర్రలతో కొట్టి హత్య చేశారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్లోని బందాలో చోటుచేసుకుంది. మృతుడు తన పూర్వీకుల ఆస్తిలో నిర్మాణ పనులు చేస్తుండగా, అతని తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి అక్కడికి చేరుకున్నారని సమాచారం. వారు నిర్మాణానికి అభ్యంతరం చెప్పినప్పుడు, […]
యాదాద్రి జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అతను తన తల్లిని కొట్టడమే. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడున్న […]
అమెజాన్ సేల్ లో స్మార్ట్ ఫోన్లపై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఐ ఫోన్ లవర్స్ కు మాత్రం ఇదే మంచి ఛాన్స్. ఐఫోన్ 15 పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. భారత్ లో దీని ప్రస్తుత ధర దాదాపు రూ. 69,900 అయినప్పటికీ, సేల్ సమయంలో, మీరు దీన్ని రూ.47,000 కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. 2023లో ప్రారంభించిన ఈ ఐఫోన్ ఇప్పటికీ రూ. 50,000 లోపు ఉన్న ఉత్తమ స్మార్ట్ఫోన్లలో […]
ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలో ఇస్లామిక్ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు అధికారులు సహా పాకిస్తాన్ పారామిలిటరీ దళాలకు చెందిన 11 మంది సభ్యులు మరణించారు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబన్ బాధ్యత వహించింది. పాకిస్తాన్ భద్రతా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుర్రం వాయువ్య జిల్లాలో రోడ్డు పక్కన బాంబులు అమర్చి, ఆ తర్వాత కాన్వాయ్ పై కాల్పులు జరిపారని వెల్లడించారు. Also Read:Venus: శుక్ర గ్రహంపై సమృద్ధిగా నీరు.. కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్తలు తెహ్రిక్-ఎ-తాలిబాన్ […]