రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం అద్భుతమైన ప్లాన్స్ ను అందిస్తోంది. చౌక ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారికి క్రేజీ ప్లాన్ అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్లో ఉన్నప్పుడు మీ సిమ్ కార్డ్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సంవత్సరం కంపెనీ కాలింగ్, SMS- ప్లాన్లను ప్రవేశపెట్టింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో కాలింగ్, SMS మాత్రమే అందించే రెండు ప్లాన్లు ఉన్నాయి. Also Read:Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ […]
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9 పై తెలంగాణ హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల పై సుప్రీంకోర్టు కి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పు ను స్టడీ చేసిన ప్రభుత్వం.. సీనియర్ కౌన్సిల్ తో సుప్రీంకోర్టు లో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింగ్వి తో పాటు సిద్ధార్థ దవే.. రిజర్వేషన్ల పై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్ […]
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. పెన్షన్ వచ్చిందని వృద్ధురాలిని నమ్మించి మెడలో ఉన్న మూడు తులాల పుస్తెలతాడు చోరీ చేశాడు ఓ అగంతకుడు. మాయ మాటలు చెప్పి రూ. 4,000 పెన్షన్ మంజూరు అయ్యిందని ఫొటో దించాలని నమ్మబలికి దొంగతనానికి పాల్పడ్డాడు. వృద్ధురాలితో మాట్లాడిన దృశ్యాలు సీసీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు శంకరమ్మ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. Also Read:Hamas: […]
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 ను తీసుకొచ్చింది. దీని ప్రకారమే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని భావించింది. జీవో 9 ఆధారంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే జీవో 9పై పలువురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు జీవో […]
టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ కాలనీలో ఒక డీసీఎం డ్రైవర్ లేబర్ లతో కలిసి సత్య మ్యాగ్నము నుంచి రాహుల్ కాలనీలో రెండవ అంతస్తుకి లిఫ్ట్‌లో సామాన్లు తీసుకెళ్లారు. ఇది గమనించిన కామ్రాన్ అనే వ్యక్తి లేబర్ల పై దుర్భాషలాడి వారిపై చేయి చేసుకున్నాడు. లేబర్లను ఎందుకు కొట్టారని డీసీఎం డ్రైవర్ ఫారుక్ వెళ్లి ప్రశ్నించగా కామ్రాన్ ఫారూఖ్ ని ఎయిర్ గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన డీసీఎం డ్రైవర్ ఫారుఖ్ వెంటనే […]
ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది యువతీ యువకులు. ప్రేమ మత్తులో పడి కన్నవారిని సైతం విడిచి వెళ్లేందుకు వెనకాడడం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు ప్రేమ పేరిట దూరమవుతుండడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి జీవించడానికి ఒక యువతి అన్ని హద్దులు దాటింది. ఓ తల్లి తన కూతురిని ఆపడానికి ప్రయత్నిస్తూ విలపిస్తోంది. ఆ యువతి తన కుటుంబంతో […]
టీవీఎస్ తన పాపులర్ స్కూటర్ టీవీఎస్ స్కూటీ జెస్ట్ కొత్త వేరియంట్ SXC ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ రూ. 75,500 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైంది. తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో వస్తోంది. కొత్త TVS స్కూటీ జెస్ట్ SXCలో వేగం, ఇంధన స్థాయి, ఓడోమీటర్, ట్రిప్‌మీటర్ వంటి సమాచారాన్ని ప్రదర్శించే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇది ఇప్పుడు బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీని కూడా కలిగి ఉంది. కాల్, SMS హెచ్చరికలను అందిస్తోంది. […]
కుటుంబ కలహాలు, ఆస్తుల పంచాయితీలతో తల్లిదండ్రులపై పిల్లలు దాడులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పిల్లల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. తాజాగా ఉమానగర్, పంజాగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న యువకుడిని స్వంత తల్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హర్ష వర్ధన్ (27) గా పోలీసులు గుర్తించారు. ఆయన తల్లి గంగులమ్మ (50) ఇళ్లలో పనులు చేస్తూ […]
ఆదిలాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతుంటారు దుండగులు. కానీ ఓ యువ దొంగ మాత్రం యజమాని కళ్ల ముందే చోరీకి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఉన్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లాడు ఓ యువకుడు. తర్వాత మద్యం తాగాక పట్టణంలోని పలు కాలనీలు అదే బైక్ పై తిప్పాడు. ఆ తర్వాత ఓ చోట బాధితుడిని దింపేసి బైక్ తో పరార్ అయ్యాడు యువదొంగ. మద్యం మత్తులోంచి తేరుకున్న బాధితుడు […]
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం బిరెల్లిలో దహన సంస్కారానికి వెళ్లి చెరువులో దిగి మంకిడి పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి చనిపోగా అతని అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారం అనంతరం స్నేహితులతో కలిసి పవన్ అనే యువకుడు చెరువులోకి దిగాడు. అయితే నవీన్, వినయ్, రణధీర్, అనే నలుగురు స్నేహితులు అవతల ఒడ్డుకు చేరుకున్నరు. కానీ, పవన్ మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం […]