మార్కెట్ లో డిమాండ్ ఉన్న బైకులలో బజాజ్ పల్సర్ ఒకటి. పల్సర్ బైకులను కొనేందుకు యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కాగా స్పోర్ట్స్ బైక్ బజాజ్ పల్సర్ భారత మార్కెట్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది 2001 లో భారత్ లో రిలీజ్ అయ్యింది. 2026 లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ ప్రత్యేక సందర్భంలో బజాజ్ ఆటో కస్టమర్ల కోసం ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద, కస్టమర్లు ఎంపిక చేసిన పల్సర్ మోడళ్లపై రూ.7,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
Also Read:Nicolas Maduro: సద్దాం హుస్సేన్, గడాఫీలకు పట్టిన గతే వెనిజులా అధ్యక్షుడికి పడుతుందా..?
దీనితో పాటు, కస్టమర్లు అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందొచ్చు. గురువారం నాడు బజాజ్ ఆటో ఈ ప్రత్యేక ఆఫర్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లలో జనవరి 2, 2026 నుండి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. లోన్ పై బైక్ కొనుగోలు చేసే వారికి ప్రాసెసింగ్ ఫీజులు మినహాయించారు. కస్టమర్‌లు ఐదు ఉచిత సేవలను కూడా పొందుతారు. అయితే, మోడల్, నగరాన్ని బట్టి ఈ ప్రయోజనాలు మారవచ్చు. బజాజ్ ఆటో ప్రపంచంలోనే ₹2 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు చేరుకున్న మొట్టమొదటి ద్విచక్ర వాహన సంస్థ. ఈ కంపెనీ 100 కంటే ఎక్కువ దేశాలకు 21 మిలియన్లకు పైగా మోటార్‌సైకిళ్లను విక్రయించింది.
Also Read:Healthy Food Myths: హెల్తీ ఫుడ్ అని తింటున్నారా? జాగ్రత్త.. ఆ ఆహారపు అలవాట్లతోనే అసలు ముప్పు!
పల్సర్ భారత్ లో 2001లో రిలీజ్ అయ్యింది. గత 25 సంవత్సరాలుగా, పల్సర్ యువత కోసం స్పోర్ట్స్ మోటార్ సైకిళ్ల కొత్త యుగానికి నాంది పలికింది, శక్తి, పనితీరు, సరసమైన ధరను అందిస్తోంది. పల్సర్ భారతదేశంలో DTS-i టెక్నాలజీ, నేకెడ్ స్పోర్ట్స్ విభాగానికి మార్గదర్శకత్వం వహించింది. ప్రస్తుతం, పల్సర్ NS400Z శ్రేణిలో అత్యంత శక్తివంతమైన మోటార్ సైకిల్‌గా పాపులర్ అయ్యింది.